జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎం హేమంత్ సోరెన్ తన ప్రభుత్వంలో కొత్త మంత్రులను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 11 మంది మంత్రులకు పదవులను ఇచ్చిన హేమంత్ సోరెన్ కీలకమైన హోమ్‌శాఖను మాత్ర తన దగ్గరే ఉంచుకున్నారు. హేమంత్ సోరేన్ టీంలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జేఎంఎం కు చెందిన ఆరుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఆర్జేడీ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలకు పదవులు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాధాకృష్ణ కిషోర్ కు ఆర్థిక, వాణిజ్య పన్నుల , ప్రణాళిక అభివృద్ధి శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు ఇచ్చారు. జేఎంఎం ఎమ్మెల్యే దీపక్ బీరువా కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, భూసంస్కరణలు, రవాణా శాఖ కేటాయించారు. ఇదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే చమ్ర లిండాకు షెడ్యూల్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనక బడిన తరగతుల శాఖలు ఇచ్చారు.
ఇక ఆర్జేడీ కి చెందిన సంజయ్ ప్రసాద్ యాదవ్ కు పరిశ్రమలు, కార్మిక శాఖ, ప్రణాళిక, శిక్షణ నైపుణ్యాభివృద్ది శాఖ, కాంగ్రెస్ కు చెందిన మరో ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీకి ఆరోగ్యం, వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖతోపాటు ఆహారం, ప్రజాపంపిణీ , వినియోగదారులు వ్యవహారాల , విపత్తు నిర్వహణ శాఖ కేటాయించారు. అలాగే రాందాస్ సోరేన్ కు పాఠశాల విద్య, అక్షరాస్యత, రిజిస్ట్రేషన్ శాఖ కేటాయించారు. హఫీజుల్ హసన్ కు జలవనరులు, మైనార్టీ సంక్షేమ శాఖ లను కేటాయించారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాంగే సింగ్ కు పంచాయతీరాజ్, గ్రామీణ పనులు, గ్రామీణాభివృద్ధి శాఖలను అప్పగించారు. జేఎంఎం ఎమ్మెల్యే సుదివ్వయకుమార్ కు పట్టణాభివృద్ది, గృహనిర్మాణం, ఉన్నత, సాంకేతిక విద్య, పర్యాటకం, కళా సంస్కృతి, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ లను ఇచ్చారు. ఇక కాంగ్రెస్ కు చెందిన మరో ఎమ్మెల్యే శిల్పి నేహా టిర్కీకి వ్యవసాయం,పశుసంవర్థక, సహకార శాఖలను కేటాయించారు. మరవైపు కేబినెట్ సెక్రటేరియట్, సిబ్బంది పరిపాలనా సంస్కరణలు , అధికార భాష, రోడ్ల నిర్మాణం, భవన నిర్మాణ శాఖలను మాత్రం ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
Also Read: TS: కొత్త తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్ విమర్శ