Supreme Court : రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రజాప్రయోజనం, వారు సురక్షితంగా ఉండడడమే అత్యంత ప్రధాన అంశమని పేర్కొంది. రోడ్డు మధ్యలో గురుద్వారా లేదా దర్గా లేదా గుడి.. ఏది నిర్మించినా ఉపేక్షించరాదని.. అవి ప్రజలకు ప్రతిబంధకంగా మారకూడదని సుప్రీం కోర్టు పేర్కొంది. మతంతో నిమిత్తం లేకుండా దురాక్రమణలను తొలగించే చర్యలు ప్రజలందరికీ వర్తింపజేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది.
అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
భారత్ సెక్యులర్ దేశమని, ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్‌తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని ధర్మాసనం తెలిపింది.
Also Read : తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ చిన్న కుమార్తె పలీనా !