/rtv/media/media_files/0MO19BxEimhy5wz2NhqV.jpg)
ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమలలో బుధవారం ఉదయం ప్రాయశ్చిత దీక్షను విరమించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలు రావడంతో అపచారం జరిగిందని పవన్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. గత నెల 22న ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన పవన్ 11 రోజుల దీక్ష తరువాత బుధవారం ఉదయం తిరుమలలో దీక్షను విరమించారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.… pic.twitter.com/Lg8zUEfl6l
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2024
Pawan Kalyan
మంగళవారం సాయంత్రం మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. గోవింద నామస్మరణ చేస్తూ 3,550 మెట్లు ఎక్కారు.తిరుమల కొండపైకి పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ సమర్పించారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పలీనాతో పాటు పవన్ కూడా సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్.. ఎవరి బలం ఎంతంటే.. లెక్కలివే!