Gandhi grandson : జాతిపిత గాంధీ మనవడికి ఘోర అవమానం.. ఎక్కడంటే?

జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలమైన మోతీహారిలో బాపు ముని మనవడు తుషార్ గాంధీకి ఘోర అవమానం జరిగింది. మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీని అవమానించి మీటింగ్ నుంచి వెనక్కి పంపారు తుర్కౌలియా JDU నేత ముఖియా వినయ్ కుమార్ సాహ్.

New Update
Tushar Gandhi

జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలమైన మోతీహారిలో బాపు ముని మనవడు తుషార్ గాంధీకి ఘోర అవమానం జరిగింది. మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీని అవమానించి మీటింగ్ నుంచి వెనక్కి పంపారు తుర్కౌలియా JDU నేత ముఖియా వినయ్ కుమార్ సాహ్. అయితే ఈ సమయంలో చాలా మంది స్థానిక ప్రజలు తుషార్ గాంధీని అవమానించిన వారికి నచ్చజెప్పాలని చూశారు. అయినా కూడా వారు వినలేదు. ముఖియ తుషార్ గాంధీని అవమానించి, సమావేశ స్థలం అయిన పంచాయితీ భవన్ నుండి బయటకు వెళ్లగొట్టాడు.

ఈ సమయంలో ఉత్తర తుర్కౌలియాకు చెందిన ముఖియా వినయ్ కుమార్ సాహ్, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాస్తవానికి తుషార్ గాంధీ జూలై 12న భితిర్వా ఆశ్రమం నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర సమయంలో తుషార్ గాంధీ తుర్కౌలియా చేరుకున్నాడు. అక్కడ అతను చారిత్రాత్మక వేప చెట్టును చూశాడు. ఆ వేప చెట్టును చూసిన తర్వాత, వినయ్ కుమార్ సాహ్ పిలుపు మేరకు, తుషార్ గాంధీ సామాన్య ప్రజల మధ్య తన పంచాయతీ భవన్‌కు చేరుకున్నాడు.

మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సామాన్య ప్రజల మధ్యకు చేరుకుని తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు. తుషార్ గాంధీతో కలిసి నడుస్తున్న ఓ వ్యక్తి బిహార్‌లో నితీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. దీంతో వినయ్ కుమార్ సాహ్ కోపంతో తుషార్ గాంధీని అవమానించడం ప్రారంభించాడు. చాలా మంది స్థానిక ప్రజలు వినయ్ సాహ్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆయన ఎవరి మాట వినలేదు. చివరికి తుషార్ గాంధీ అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు