Health Insurance:
జీఎస్టీ రేట్లను సరిచేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. ఇందులో కొన్ని వస్తువులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం 20 లీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్, సైకిళ్లు, ఎక్సర్‌సైజ్ నోట్‌బుక్స్ లాంటి వస్తువలపై జీఎస్టీ తగ్గించారు. అదే సమయంలో వాచీలు, ఖరీదైన షూస్ మీద పన్ను పెంచాలని ప్రతిపాదించారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం భేటీలో దీనిపై చర్చ జరిగింది. దీనివల్ల రూ.22వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. 20 లీటర్ల వాటర్ బాటిల్ మీద 5శాతం, 10వేల లోపు ధర ఉన్న సైకిళ్ళ మీద కూడా 5 శాతం తగ్గించేందుకు నిర్ణయించారు. నోట్ బుక్స్ కూడా 5శాతం జీఎస్టీ తగ్గనుంది. అయితే వీటిని ఇంకా జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంది. అలాగే, రూ.15 వేలు కంటే ఎక్కువ రేట్ ఉన్న షూస్, రూ.25వేల కంటే ఎక్కువ ధర ఉన్న చేతి వాచ్‌లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచాలని ఉప సంఘం ప్రతిపాదించింది. మొత్తం ఈ భేటీలో 100 వస్తువులకు సంబంధించి జీఎస్టీ రేట్లను చర్చించారు.
సీనియర్ సిటిజన్లకు ఊరట..
పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. దీంతో 5 లక్షల వరకు కవరేజీ ఉన్న హెల్త్ బీమా కోసం చెల్లించే ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని నిర్ణయించారు. ఈ విషయంలో మతి వర్గ బృందం అంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ దే. అయితే దీనికి కౌన్సిల్ తప్పకుండా ఒప్పుకుంటుందని చెబుతున్నారు.
Also Read: రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా పరుగులు..సర్ఫరాజ్ అద్భుత సెంచరీ