రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా పరుగులు..సర్ఫరాజ్ అద్భుత సెంచరీ

కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఫ్సట్‌ ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయిన భారత బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం పరువు నిలబెట్టుకుంది. 462 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్ 150 పరుగులు, రిషబ్ పంత్ 99 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
ind

Ind Vs NZ: 

కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఫ్సట్‌ ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయిన భారత బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం పరువు నిలబెట్టుకుంది. 462 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్ 150 పరుగులు, రిషబ్ పంత్ 99 పరుగులతో చెలరేగిపోయారు. దాదాపు అందరు బ్యాటర్లు బాగా ఆడారు. విరాట్ కోహ్లీ (70), రోహిత్‌ (52), జైశ్వాల్‌ (32) పరుగులు చేశారు. 

సర్ఫరాజ్ అద్భుత సెంచరీ..

భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పరుగులతో సంచలనం సృష్టించాడు. కేవలం 110 పరుగుల్లో సెంబరీని చేసి వావ్ అనిపించాడు. సర్ఫరాజ్ కెరీర్‌‌లో ఇదే మొదటి అంతర్జాతీయ సెంచరీ. ఆడిన నాలుగో టెస్ట్‌లోనే శతకం చేయడం విశేషం.  ఓవర్‌నైట్‌ 70 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సర్ఫరాజ్‌ ఎక్కడా తడబాటుకు  గురి కాకుండా చివరి వరకూ ఆడాడు.  చూడ చక్కని షాట్లతో అలరించాడు. ఆఫ్‌సైడ్ లేట్ కట్టర్లతో బౌండరీలు రాబట్టాడు. రిషభ్‌ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ పరుగులు పెట్టించాడు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేయగా.. భారత్ 46 రన్స్‌కే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 356 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (70)తో కలిసి సర్ఫరాజ్‌ ఖాన్ దూకుడుగా ఆడాడు. కివీస్‌ పేస్, స్పిన్‌ను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ సాధించాడు. 

పంత్ ఈజ్ బ్యాక్...

మొదటి ఇన్నింగ్స్ లో పంత్ ఆడలేకపోయాడు. కాలికి దెబ్బ తగలడంతో  మూడో రోజు కీపింగ్  చేయలేదు. రెండో ఇన్నింగ్స్‌ కూడా ఆడలేడు అనుకున్నారు కానీ కీలకమైన ఇన్నింగ్స్‌లో బ్యాంటింగ్ కు దిగడమే కాకుండా...సిక్స్‌లతో చితక్కోట్టాడు. రిషభ్ పంత్ 99; 105 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు