Gold Rates : పసిడి ప్రియులకు నేడు కాస్త స్వల్ప ఊరట లభించింది. రోజురోజుకి బంగారం ధరలు (Gold Rates) పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా లేకపోవడంతో బంగారం రేట్లు తగ్గుతాయని కొనుగోలుదారులు అనుకుంటున్నారు. అయితే కొనుగోలు చేయాలని వెళ్తున్న వారికి మాత్రం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.
దేశీయంగా ధరలు పెరిగేందుకు ప్రధాన కారణంగా గ్లోబల్ మార్కెట్లలో ధరలు రికార్డ్ స్థాయిలో ఉండడమేనని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు రెడీ అవుతుందనే వార్తలతో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తుంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rates Today) నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. రూ. 74 వేల 890 వద్ద స్థిరంగా ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 68,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీలో రూ. 74 వేల 40 వద్ద ఉంది.
Also Read : వంటనూనె ధరలపై సుంకం పెంచిన కేంద్రం!
స్థిరంగానే వెండి ధర..
హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర గత మూడు రోజుల్లో భారీగా పెరిగింది. కిలో పై ఏకంగా రూ.5500 మేర పెరిగింది. అయితే ఇవాళ స్థిరంగా అదే రేటు వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.97 వేల వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.92 వేల ట్రేడింగ్ నడుస్తుంది.
Also Read : పండుగల వేళ..వంటింట్లో మంట పెడుతున్న నూనెలు!