Gold Rates : స్థిరంగా పుత్తడి ధరలు..వెండి ఎలా ఉందంటే…! బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. రెండ్రోజుల పాటు వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ ఏ మార్పు లేకుండా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయిఅంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదలతో దేశీయంగా రేట్లు పెరుగుతున్నట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. By Bhavana 16 Sep 2024 | నవీకరించబడింది పై 16 Sep 2024 10:56 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Gold Rates : పసిడి ప్రియులకు నేడు కాస్త స్వల్ప ఊరట లభించింది. రోజురోజుకి బంగారం ధరలు (Gold Rates) పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా లేకపోవడంతో బంగారం రేట్లు తగ్గుతాయని కొనుగోలుదారులు అనుకుంటున్నారు. అయితే కొనుగోలు చేయాలని వెళ్తున్న వారికి మాత్రం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దేశీయంగా ధరలు పెరిగేందుకు ప్రధాన కారణంగా గ్లోబల్ మార్కెట్లలో ధరలు రికార్డ్ స్థాయిలో ఉండడమేనని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు రెడీ అవుతుందనే వార్తలతో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rates Today) నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. రూ. 74 వేల 890 వద్ద స్థిరంగా ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 68,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీలో రూ. 74 వేల 40 వద్ద ఉంది. Also Read : వంటనూనె ధరలపై సుంకం పెంచిన కేంద్రం! స్థిరంగానే వెండి ధర.. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర గత మూడు రోజుల్లో భారీగా పెరిగింది. కిలో పై ఏకంగా రూ.5500 మేర పెరిగింది. అయితే ఇవాళ స్థిరంగా అదే రేటు వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.97 వేల వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.92 వేల ట్రేడింగ్ నడుస్తుంది. Also Read : పండుగల వేళ..వంటింట్లో మంట పెడుతున్న నూనెలు! #gold-rates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి