/rtv/media/media_files/2025/02/05/HC8k7kQbAnO8zqgmSriN.jpg)
Drug packets
Drug: గంజాయి నివారణకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా గంజాయి అక్రమ రవాణాలు ఆగటం లేదు. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం రేపింది. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కస్టమ్స్ అధికారులు పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు. కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇది కూడా చదవండి: గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఎప్పుడు టీకాలు వేయించుకోవాలి
కోట్ల విలువ చేసే గంజాయి..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న భారీ ఫారిన్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 47 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు స్మగ్లర్ల ఈ గంజాయిని తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గంజాయితోపాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని 94 ప్యాకెట్లగా ప్యాక్ చేసి ఐదు ట్రాలీ బ్యాగుల్లో నింపి కేటుగాళ్లు తరలిస్తున్నారు. స్మగ్లర్ గంజాయి బాగితో గ్రీన్ చానెల్ దాటే ప్రయత్నం చేస్తుండగా కస్టమ్స్ అధికారలు నిఘ పెట్టి ఎట్టకేలకు కేటుగాళ్ల ఆట కట్టించారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి ఎన్‌డిపిసి యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. .
ఇది కూడా చదవండి: వైట్ పెప్పర్ వర్సెస్ బ్లాక్ పెప్పర్.. రెండింటిలో ఏది బెటర్