First Miss India: భారత తొలి మిస్‌ ఇండియా కాస్టెలినో కన్నుమూత

భారత మొదటి మిస్ ఇండియా మెహర్ కాస్టెలినో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె 81 ఏళ్ళు.

New Update
castelino

భారత్ కు ఫ్యాషన్ జర్నలిజాన్ని నేర్పించిన ఐకాన్, మొదటి మిస్ ఇండియా  మెహర్ కాస్టెలినో ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు. 81 ఏళ్ళ ఈ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రు. ఆమెకు కుమారుడు కార్ల్, కోడలు నిషా, కుమార్తె క్రిస్టినా ఉన్నారు. ముంబైలో జన్మించిన మెహర్, 1964లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా మెహెర్ కాస్టెలినో నిలిచారు.  దీని తర్వాత కూడా ఈమె  మిస్ యూనివర్స్, మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీలలో భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించారు. 

ఫ్యాషన్ జర్నలిజం ఐకాన్..

మోడలింగ్, టైటిల్ విన్నింగ్ తర్వాత మెహర్ ఫ్యాషన్ జర్నలిజంలోకి అడుగు పెట్టారు. 1973లో ఈవ్స్ వీక్లీ లో తన మొదటి కథనాన్ని ప్రచురించారు. చాలా కొద్ది టైమ్ లోనే మెహర్ ఫ్యాషన్ కాలమిస్ట్ గా ఎదగి..160 జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో వ్యాసాలు రాశారు. మ్యాన్‌స్టైల్’,  ‘ఫ్యాషన్ కెలిడోస్కోప్’ వంటి పుస్తకాలు కూడా ఆమె రచించారు. భారత్లో ఫ్యాషన్ జర్నలిజానికి మెహర్ కాస్టెలినో ఐకాన్ అనే చెప్పవచ్చును. లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి అనేక ప్రధాన ఫ్యాషన్ ఈవెంట్లకు ఆమె అధికారిక ఫ్యాషన్ రైటర్‌గా పనిచేశారు. ఫ్యాషన్‌ను కేవలం సెలబ్రిటీల గ్లామర్‌గా కాకుండా, ఒక పరిశ్రమగా విశ్లేషించిన తొలితరం జర్నలిస్టులలో కాస్టెలినో కూడా ఒకరు.

Advertisment
తాజా కథనాలు