Fire Accident: కెమికల్‌ కంపెనీలో మంటలు...ఆరుగురు సజీవ దహనం!

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలోని తారాపూర్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన అగ్రిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
fire accident

Maharastra: మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలోని తారాపూర్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన అగ్రిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా...వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలు చెలరేగాయని పోలీసు అధికారులు చెప్పారు. అయితే మంటలు ఎలా చెలరేగాయి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యాజమాన్యం అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చింది. వెంటనే కంపెనీ ఉద్యోగులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

మంటల్లో కాలిపోయిన ఆరుగురు కార్మికులను నిషికాంత్ చౌదరి (36), పవన్ డెస్లే (32), సంతోష్ హింద్లేకర్ (49), ఆదేశ్ చౌదరి (25) రాజ్ మౌర్య (45), , చందన్‌లుగా గుర్తించారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు