Miss India 2024 Nikita Porwal: ముంబైలో అక్టోబర్ 16న జరిగిన 60వ ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. అందులో మధ్యప్రదేశ్‌కు చెందిన నికితా పోర్వాల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో చాలా మంది నికితా పోర్వాల్ ఎవరు? ఆమె కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది.. ఎలా స్టార్ట్ అయింది?.. ఆమె ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఎవరీ నికిత పోర్వాల్
అశోక్ పోర్వాల్ - రాజ్ కుమారి దంపతుల కూతురు నికితా పోర్వాల్ మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలో జన్మించారు. చిన్నప్పటి నుంచే జీవితం పట్లు చాలా ఉత్సుకతను పెంచుకున్నారు. ఆమె కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.
ఇది కూడా చదవండి: చనిపోయే ముందు మాట్లాడే మూడు మాటలు
తల్లిదండ్రుల పోత్సాహంతో
ఆమె హైస్కూల్ నుంచే మోడలింగ్‌లోకి రావాలని ఎంతగానో భావించారు. దానికి ఆమె తండ్రి అశోక్ పోర్వాల్ ప్రోత్సాహం అందించారు. కూతురి ప్రతిభ గమనించిన తండ్రి.. మోడలింగ్ రంగంలోకి నికితను చిన్న వయసులోనే ప్రవేశపెట్టారు. తల్లి రాజ్ కుమారి సైతం నికితను బాగా ప్రోత్సహించింది.
టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభం
ఇది కూడా చదవండి: 'రివాల్వర్ రీటా' వచ్చేసింది.. కీర్తి కొత్త మూవీ టీజర్ అదిరింది
ఆ తర్వాత నికితా పోర్వాల్ తనకు 18 ఏళ్లు ఉన్నపుడు టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నటన రంగం వైపు ఆమె ఆసక్తి చూపించారు. సీరియల్స్, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి మంచి గుర్తింపు అందుకున్నారు.
250 పేజీల ‘కృష్ణలీల’ నాటకాన్ని రాసింది
ఇది కూడా చదవండి: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
చదువుతో పాటు కళల పట్ల ఆమెకున్న అభిరుచి ఆమెను థియేటర్ ఆర్ట్స్, ఫిల్మ్ కెరీర్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఇందులో భాగంగానే నికిత 60కి పైగా నాటకాలలో ప్రదర్శన చేశారు. అంతేకాకుండా దాదాపు 250 పేజీల ‘కృష్ణలీల’ నాటకాన్ని కూడా రాసి రచయితగా మంచి ప్రతిభను చాటుకున్నారు.
మొదటి చిత్రం ‘చంబల్ పార్’
ఇది కూడా చదవండి: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?
ఆమె మొదటగా నటించిన చిత్రం ‘చంబల్ పార్’. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంది. త్వరలో ఈ సినిమా ఇండియాలో విడుదలయ్యే అవకాశం ఉంది. అందం, అభినయం, తెలివితేటలతో మిస్ ఇండియా గౌరవాన్ని గెలుచుకున్నందుకు నికితా ఫ్యామిలీ చాలా గర్వపడుతోంది.