Breaking: మరో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

F-35B ఫైటర్ జెట్ కేరళలో తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంధనం తక్కువగా ఉండటం వల్ల F-35 ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అరేబియా సముద్రంలో మోహరించనున్న HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమాన వాహక నౌకకు చెందినదిగా అధికారులు వెల్లడించారు.

New Update
f-35 fighter jet emergency landing at Kerala airport

f-35 fighter jet emergency landing at Kerala airport

 Breaking:  బ్రిటన్ దేశానికి  చెందిన ఫైటర్ జెట్ F-35B లైట్నింగ్ II యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నౌక చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం,ఇంధనం తక్కువగా ఉండడం  వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధ విమానం అరేబియా సముద్రంలో మోహరించనున్న HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమాన వాహక నౌకకు చెందినదిగా అధికారులు వెల్లడించారు.

Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

లాక్‌హీడ్ మార్టిన్ F-35 జెట్

ప్రస్తుతం ఈ గ్రూప్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్  F-35 జెట్ ను రూపొందించింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధునాతన మల్టీరోల్ ఫైటర్ విమానాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. 

ఈ విమానం స్టెల్త్ సామర్థ్యాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, డేటా షేరింగ్ వ్యవస్థలు అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ మరియు నాటో దేశాల ఆధునిక వైమానిక వ్యూహాలకు కీలకంగా చెబుతారు. అయితే ఈ అత్యవసర ల్యాండింగ్ గురించి బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ గానీ, లాక్‌హీడ్ మార్టిన్ గానీ ఎటువంటి అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. ఆదివారం ఉదయం వరకు, ఈ యుద్ధ విమానం తిరువనంతపురం విమానాశ్రయంలోనే ఉంది.

Allu Arjun: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు