Breaking: ఆర్థిక వేత్త బిబేక్‌ దెబ్రాయ్‌ కన్నుమూత!

ప్రముఖ ఆర్థిక వేత్త బిబేక్‌ దెబ్రాయ్‌ కన్నుమూశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్‌ శుక్రవారం హఠాత్తుగా మరణించారు.దెబ్రాయ్‌ మృతికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు.

New Update
econamist

Breaking: ప్రముఖ ఆర్థిక వేత్త బిబేక్‌ దెబ్రాయ్‌ (69) కన్నుమూశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్‌ శుక్రవారం హఠాత్తుగా మరణించారు. దెబ్రాయ్‌ మృతికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Also Read:  తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్‌..భారీగా ధరల పెంపు!

దెబ్రాయ్‌ నాకు చాలా కాలంగా తెలుసు. ఆర్థిక శాస్త్రం , చరిత్ర, రాజకీయాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత ఇలా ఎన్నో విభిన్న రంగాల్లో ఆయనకు ఎంతో ప్రావీణ్యం ఉంది. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి అతీతం. ప్రాచీన గ్రంథాల పై పని చేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

Also Read:  హైదరాబాద్ లో కారు బీభత్సం.. కేబీఆర్ పార్క్ దగ్గర ఏమైందంటే?

ఆయన మృతి నన్ను...

యువత కోసం వాటిని అందుబాటులోకి తెచ్చారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. ఆయన కుటుంబ సభ్యులకు , స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి ఓం శాంతి అని మోదీ అన్నారు. దెబ్రాయ్‌ మృతికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ విచారం వ్యక్తం చేశారు.

Also Read:  దీపావళి వేడుకల్లో అపశృతి..సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 40 మంది

దెబ్రాయ్‌ గతంలో కోల్‌ కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత పూణేలోని గోఖలే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ లో ఛాన్సలర్‌ గా ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ లో విధులు నిర్వహించారు. ఆ తరువాత పలు ఇనిస్టిట్యూట్‌ లలో వివిధ హోదాల్లో పని చేశారు.

Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

2019 వరకు దెబ్రాయ్‌ నీతి ఆయోగ్‌ లో సభ్యుడిగా ఉన్నారు. పలు పుస్తకాలు, కథనాలు రచించడంతో పాటు పలు వార్తా సంస్థలకు సంపాదకులుగా కూడా వ్యవహరించారు. ఆర్థిక శాస్త్రంలో దెబ్రాయ్‌ చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు