Maharshtra and Jharkhand Elections:
ఓట్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు డబ్బులను తెగ ఖర్చు పెడారు. ప్రతీ రాష్ట్రంలోనూ జరిగేదే ఇది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రా, జార్ఖండ్‌లలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇక్కడ పార్టీలు ముమ్మరంగా ప్రారం చేంతో పాటూ డబ్బులను కూడా వెదజల్లుతున్నారు. ఈనేపథ్యంలో ఈసీ మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరగనున్న రెండు లోక్‌సభ సీట్లు, 48 అసెంబ్లీ స్థానాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. దీంట్లో ఇప్పటి వరకు మొత్తంగా రూ.558.67 కోట్లు విలువైన నగదుతో పాటూ రూ.52.76 కోట్ల విలువ చేసే మద్యం, రూ.68.22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.104.18 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.241.02 కోట్ల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులను సీజ్ చేసింది.
ఈ పట్టుబడిన మొత్తంలో మహారాష్ట్ర నుంచే 280 కోట్లు ఉన్నాయని ఈసీ తెలిపింది. జార్ఖండ్ నుంచి 158 కోట్లు సీజ్ చేశామని చెప్పింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీజ్ చేసిన మొత్తం 3.5 రెట్లు అధికంగా ఉన్నట్లు చెబుతోంది ఈసీ. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. ఝార్ఖండ్‌లో నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. అలాగే, కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read: USA: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాలను ఆపగలరా?