Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..12 మంది మృతి రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికార్ జిల్లాలో వేగంగా వెళుతున్న ఓ ప్రవైట్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా...పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. By Manogna alamuru 29 Oct 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bus Accident: రాజస్థాన్‌లో సలాసర్ నుంచి సికర్ జిల్లాకు వెళుతున్న ఓ ప్రవైట్ ట్రావెల్ బస్సు. లక్ష్మణ్‌గఢ్ దగ్గర యాక్సిఎంట్‌కు గురంది. బస్సు కల్వర్టును ఢీకొని అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఇందులో 12 మంది అక్కడిక్కడే మృతి చెందగా...మరో 40 మంది ప్రయాణికులకు తీవ్రగాయాయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. క్షతగాత్రులను లక్ష్మణ్‌గఢ్‌లోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగగా బస్సును నడపడంతో డ్రైవ్ నియంత్రణను కోల్పోయాడని..అందుకే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన ప్రయాణికులకు మంచి వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మరోవైపు బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుగ భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీపావళి ముందు ఇలా జరగడంతో రాజస్థాన్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. Also Read: USA: అమెరికాలో అంతుచిక్కని అందాలు..ఫాల్ కలర్స్! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి