/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
అస్సాం రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంప కేంద్రం ధేకియాజులి వద్ద ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) గుర్తించింది. ఈ ప్రకంపనలు కేవలం అస్సాంలోనే కాకుండా ఉత్తర బెంగాల్, భూటాన్ వంటి పొరుగు ప్రాంతాల్లో కూడా బలంగా వ్యాపించాయి. భూకంపం ధాటికి భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి వీధల్లోకి పరుగులు పెట్టారు.
🚨🚨BIG: Earthquake with 5.9 magnitude on the richter scale hits Guwahati and parts of Assam.
— The Truth India (@thetruthin) September 14, 2025
Shake felt for multiple seconds, with two waves of hit.
ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు అందలేదు. అయితే, కొన్ని పాత భవనాలకు స్వల్ప పగుళ్లు వచ్చాయని, కొన్ని చోట్ల వస్తువులు కింద పడిపోయాయని సమాచారం. భూకంపం సంభవించిన వెంటనే స్థానిక అధికారులు, విపత్తు సహాయక బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.