Delhi: రాజధాని నగరం ఢిల్లీలో ఓ రెండతస్తుల భవనం కుప్పకూలింది. కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం బుధవారం ఉదయం కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్ టీమ్స్ కూడా పాల్గొన్నాయి. అయితే, ఇప్పటి వరకు 12 మందిని రెస్య్కూ టీమ్స్ రక్షించాయి. కాగా, ఇటీవల దేశ రాజధానిలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగానే ఈ బిల్డింగ్ కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో భారీ వర్షాల వల్ల పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్న శిథిలమైన భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు నిర్థారించారు.
Also Read: Jhony Master Arrest: జానీ మాస్టర్ కు పోలీసులు నోటీసులు!