Diwali crackers: దీపావళి పండుగ వేళ ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో దీపావళి రోజు బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విక్రయాలకు అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అంతేకాదు బాణాసంచా నిల్వ చేసిన గోదాంలను సీల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బయటికి స్టాక్ వెళ్లకుండా నిలువరించాలని, గోదాంల సీలింగ్ ప్రక్రియలో ఢిల్లీ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలని సూచించింది.
ఇది కూడా చదవండి: భారత్ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు
ఢిల్లీ ఫైర్ వర్క్స్ షాప్ కీపర్స్ అసోసియేషన్ ఫిర్యాదు..
ఇక హస్తినలో బాణాసంచా నిల్వ, విక్రయాల కోసం లైసెన్సులు కలిగిన వ్యాపారులంతా ‘ఢిల్లీ ఫైర్ వర్క్స్ షాప్ కీపర్స్ అసోసియేషన్ పేరిట అమ్మకాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు. అయితే అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించిన న్యాయస్థానం.. బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో బాణాసంచాను తాము విక్రయించనప్పటికీ.. పాత స్టాక్‌ను కలిగి ఉన్నామనే ఏకైక కారణంతో అధికారుల వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోందని కోర్టుకు సదరు అసోసియేషన్ వివరించింది.
ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్
కఠిన చర్యలు తప్పవు..
ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ నారులా మాట్లాడుతూ.. అనుమతి ఇచ్చేది లేదన్నారు. ఎవరైనా వ్యాపారులు బాణాసంచాను విక్రయించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలపై బ్యాన్ విధిస్తూ ఆప్ ప్రభుత్వం సెప్టెంబరు 14న ఆదేశాలు జారీ చేశారు.