ఏపీలో ఒక స్కూల్‌లో టీచర్‌‌గా పనిచేసిన ఢీల్లీ సీఎం అతిశీ..ఎక్కడో తెలుసా?

ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అతిశీ బాగా చదువుకున్నవారని అందరికీ తెలిసిన విషయమే. 2013లో ఈమె రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అంతకు ముందు అతిశీ స్కూల్ టీచర్‌‌గా పని చేశారు. అయితే ఈమె ఎక్కడ..ఏ స్కూల్లో టీచర్‌‌గా పని చేశారో తెలుసా?

New Update
cm

Rishi Valley School: అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఢిల్లీ తరువాతి సీఎంగా అతిశీ (Atishi) పదవిని చేపట్టనున్నారు. ఈమె ఎమ్ఐటీ, ఐఐటీల్లో చదివారు. ఈ హైలీ ఎడ్యుకేటెడ్ మినిస్టర్ రాజకీయాల్లోకి రాకముందు చాలా ఉద్యోగాలు కూడా చేశారు. ఆ టైమ్‌లో ఏపీలోని రిషీవ్యాలీ స్కూల్లో కూడా అతిశీ పని చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలంలో రిషివ్యాలీ స్కూల్‌ ఉంది. ఇది ఒక రెసిడెన్షియల్ స్కూల్. దీనిని జిడ్డు కృష్ణమూర్తి స్థాపించారు. గతంలో ఆతిశీ ఈ స్కూల్‌లోనే ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈమె 2003 జులై నుంచి 2004 మార్చి వరకు ఇక్కడ హిస్టరీ టీచర్‌గా పనిచేశారు. దాంతో పాటూ 6, 7 తరగతులకు ఇంగ్లీషును కూడా చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు తమకు పాఠాలు చెప్పిన టీచర్ ఢిల్లీకి ముఖ్యమంత్రి అవనున్నారని తెలిసి పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ స్కూల్లో టీచర్‌గా పనిచేసిన అతిశీ సీఎం కానుండటంతో.. రిషివ్యాలీ స్టాఫ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతిశీ చాలా క్రియాశీలకంగా పని చేశారు. ఢిల్లీని పాలించిన మహిళా సీఎంలలో అతిశీ మూడవ వారిగా నిలిచారు. ఈమె కన్నా ముందు కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్‌లు ముఖ్యమంత్రులుగా పని చేశారు. అయితే వీరి ముగ్గురిలో చిన్న వయసులోనే ముఖ్యమంత్రి ఘనత మాత్రం అతిశీకే దక్కుతుంది. ఈమె 2013లో ఆప్‌లో జాయిన్ అయ్యారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. ఆ తర్వాత మూడేళ్లపాటు మనీశ్‌ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా విధులు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఈస్ట్‌ ఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభకు పోటీచేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ చేతిలో ఓడిపోయారు. ఆ వెంటనే 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత ఈఈమె మినిస్టర్‌‌గా చేశారు. ఢిల్లీలో ప్రవేశపెట్టిన ఎడ్యుకేషన్ పాలసీల వెనుక అతిశీ ఆలోచన ఉందని చెబుతారు.

Also Read: Stock Market: బ్రేక్ పడింది..నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Advertisment
తాజా కథనాలు