Aravind Kejriwal: అన్నట్టుగానే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసేశారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వీగే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్ ఆయనకు తన రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ, ఇతర మంత్రులను తీసుకెళ్లారు.
మరోవైపు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఎంపికయ్యారు. ఈ రోజు నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెవైపే మొగ్గు చూపారు. ఆతిశీ మర్లెనా సింగ్ ప్రస్తుతం విద్యాశాఖ, దివ్యాంగుల శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన ఆతిషి.. ఢిల్లీలోని పాఠశాలల విద్యా పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్టయిన అనంతరం అతిషి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్, సిసోడియా జైల్లో ఉన్నప్పుడు.. పార్టీ బాధ్యతలు తీసున్నారు
Also Read: Stock Market: ఈరోజు కూడా లాభాల్లోనే స్టాక్ మార్కెట్లు