Marriage : సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి.. ఇద్దరు మహిళల వివాహం

సాంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల సుందర్‌బన్స్ ప్రాంతంలో ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు లింగ భేదం లేదని నిరూపించారు.

New Update
marriage

సాంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల సుందర్‌బన్స్ ప్రాంతంలో ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు లింగ భేదం లేదని నిరూపించారు. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌కు చెందిన ఇద్దరు యువతులు, 19 ఏళ్ల రియా సర్దార్,  20 ఏళ్ల రాఖీ నస్కర్ స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నారు.

ఇద్దరూ ప్రొఫెషనల్ డ్యాన్సర్లు

రియా, రాఖీ ఇద్దరూ ప్రొఫెషనల్ డ్యాన్సర్లు. ఇద్దరూ దాదాపు రెండు సంవత్సరాల క్రితం కలుసుకున్నారు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. "మేము రెండేళ్లుగా సంబంధంలో ఉన్నాము. మేము మొదట ఒక ఆలయంలో కలిశాము. జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాము" అని రాఖీ చెప్పింది.

రాఖీ కుటుంబంతో పాటుగా

రియా కుటుంబం ఈ సంబంధాన్ని వ్యతిరేకించగా, రాఖీ కుటుంబంతో పాటుగా అనేక మంది గ్రామస్తులు ఆ జంటకు మద్దతు ఇచ్చారు. వారి సహాయంతో, ఇద్దరు మహిళలు స్థానిక ఆలయంలో ఒకటయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో రియా, రాఖీ దండలు మార్చుకుని, ఒకరికొకరు సింధూరం పెట్టుకున్నారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

 "సమలింగ వివాహాల గురించి వార్తల్లో, టీవీల్లో విన్నాం కానీ, ఇంత దగ్గరగా, ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టే, మేము వారికి మద్దతుగా నిలిచాం" అని వివాహాన్ని ఏర్పాటు చేసిన స్థానిక నివాసి ఒకరు తెలిపారు. "ప్రేమే ముఖ్యం, ఇక్కడ లింగ భేదం లేదు. మేము జీవితాంతం కలిసి ఉంటాము" అని రియా, రాఖీ పెళ్లి తర్వాత తెలిపారు.

Advertisment
తాజా కథనాలు