సైబర్ నేరగాల్లు రెచ్చిపోతున్నారు. సంపన్నులే టార్గెట్‌గా చేసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఫోన్‌కి లింక్‌లు పంపించి క్లిక్ చేయగానే దోచేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అంటూ కొత్త స్కాంకు తెరతీసారు. మనీలాండరింగ్ జరిగిందంటూ చెప్పి బాధితులను భయపెట్టి కోట్లలో కొట్టేస్తున్నారు.
ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య
రూ.16 లక్షలు దోచేశారు
తాజాగా అలాంటిదే జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఓ వ్యక్తికి సైబర్ నేరగాల్ల నుంచి కాల్ వచ్చింది. వారు కొన్ని సూచనలు చేశారు. కానీ అవేమి బాధితుడు చేయలేదు. కానీ రూ.16 లక్షలు పోగొట్టుకున్నాడు. అదెలా సాధ్యం అయిందో బాధితుడికి కూడా అంతుచిక్కట్లేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా..
ఢిల్లీలోని ద్వారకా నివాసి అయిన 73 ఏళ్ల రామ్‌వీర్ సింగ్ చౌదరి తాను కాల్ చేసిన వ్యక్తి చెప్పేది మాత్రమే విన్నానని, అతని సూచనల మేరకు ఏమీ చేయలేదని అన్నారు. అయినా కూడా తన ఖాతా నుంచి ఎవరో రూ.16 లక్షలు డ్రా చేశారని తెలిపారు. చౌదరి ఫిర్యాదు మేరకు ద్వారకా సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చూడండి: Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు..
రామ్‌వీర్ సింగ్ చౌదరి ప్రకారం.. తెలియని కాలర్ తన మొబైల్ సిమ్‌ను 4G నుండి 5Gకి అప్‌గ్రేడ్ చేయమని అడిగాడని చెప్పాడు. అయితే ఆ తర్వాత వారు కాల్ చేసినా తాను స్పందించలేదని, వ్యక్తిగత సమాచారాన్ని కూడా షేర్ చేయలేదని, ఎలాంటి లింక్‌పై క్లిక్ చేయలేదన్నారు. ఆ కాల్ వచ్చిన మూడు రోజుల్లోనే తన బ్యాంకు ఖాతా నుంచి రూ.16,64,300 డ్రా అయ్యాయని చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ద్వారకా సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా..
ఇలాంటిదే మరొకటి
అయితే ఇలా జరగడం ఇదేమి మొదటి సారి కాదు. జూలైలో దక్షిణ ఢిల్లీలోని CR పార్క్‌లో నివసిస్తున్న 72 ఏళ్ల కృష్ణ దాస్‌గుప్తా కూడా ఇదే విధమైన ఉచ్చులో ఇరుక్కున్నారు. సైబర్ మోసగాళ్ళు ఆమెను ‘డిజిటల్ అరెస్టు’ చేస్తున్నామని చెప్పి ఆమె బ్యాంక్ ఖాతా నుండి రూ. 83 లక్షలు దోచుకున్నారు.