/rtv/media/media_files/2025/05/26/4WfOTlH3iODpIoZFVLPJ.jpg)
పాకిస్తాన్ నిఘా అధికారులకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలపై CRPF జవాన్ ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఏజెన్సీ వెల్లడించిన ప్రకారం మోతీ రామ్ 2023 నుండి పాకిస్తాన్ కగూఢచర్య కార్యకలాపాలలో పాల్గొంటూ వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. అతన్ని ఢిల్లీలో అరెస్టు చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే అతను ఏ సమాచారాన్ని లీక్ చేశాడన్నది తెలియాల్సి ఉంది. పాటియాలా హౌస్‌లోని ప్రత్యేక కోర్టు అతనికి జూన్ 6 వరకు NIA కస్టడీ విధించింది.
NIA Arrests CRPF Jawan for Spying for Pakistan!
— Caffeinated ☕ (@caffeinwriting) May 26, 2025
• Moti Ram Jat allegedly shared classified security info with Pak intel since 2023
• Received funds via covert channels
• Arrested in Delhi, remanded till June 6
12+* arrests in North India* in Pak-linked spy ring#Espionage
12 మంది అరెస్ట్
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత భద్రతా సంస్థలు నిఘా పెంచిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. గత రెండు వారాలలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో గూఢచర్య కార్యకలాపాలకు సంబంధించి కనీసం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు, ఆమె పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధాలు కొనసాగించినట్లు సమాచారం.
గుజరాత్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి పోలీసులకు చిక్కాడు. భారత వైమానిక దళం (IAF), సరిహద్దు భద్రతా దళం (BSF) కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్ తో పంచుకున్నందుకు కచ్ ప్రాంతానికి చెందిన సహదేవ్ సింగ్ గోహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సహదేవ్ కచ్‌లోని దయాపర్‌లో హెల్త్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. 28 ఏళ్ల అదితి భరద్వాజ్ అనే పేరుతో పాకిస్తానీ హ్లాండ్లర్ సహదేవ్‌తో వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుని ట్రాప్ చేసింది. కీలక సమాచారాన్ని చేరవేసినందుకు సహదేవ్ రూ.40వేలు తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.