/rtv/media/media_files/GAHxshbZy1TspnVzYiQ8.jpg)
Cooking Oil :
రానున్న రోజుల్లో వంటనూనె ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడి, రిఫైన్డ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో పామ్ ఆయిల్, సోయా నూనె, పొద్దుతిరుగుడు నూనె ధరలు పెరగనున్నాయి.
Also Read : చచ్చినా అలాంటి పాత్రలో నటించను : జాన్వీ కపూర్
ఇప్పటివరకు ముడి సోయా, సన్‌ఫ్లవర్, పామ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీ ఉండేది కాదు. ఇప్పుడు 20 శాతం కస్టమ్స్ డ్యూటీ విధించింది. గతంలో రిఫైన్డ్ పామ్ ఆయిల్, సోయా నూనె, పొద్దుతిరుగుడు నూనెపై 12.5 శాతం దిగుమతి ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు వీటిపై 32.5 శాతం దిగుమతి సుంకం పడనుంది. మొత్తంగా ముడి నూనెలపై సుంకం 5.5 శాతం నుంచి 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై సుంకం 13.75 శాతం నుంచి 35.75 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : పాఠశాలలకు మరోసారి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!
ఇది సెప్టెంబర్ 14 నుంచి అమలులోకి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ నూనెల ధరలు పెరగడంతో పాటు డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని కేంద్రం 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
Also Read : టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ పరీక్ష ఫలితాల డేట్ ఫిక్స్!?
Also Read : నా ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ సందేశాలకు స్పందించకండి : నయనతార