/rtv/media/media_files/2026/02/05/fotojet-22-2026-02-05-19-14-02.jpg)
The hero who planted the feet of a sanitation worker
Tamil Nadu : తమిళనాడులోని, చెన్నై నగరంలో ఎథిరాజ్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమం అందరి హృదయాలను కదిలించింది. ఆ వేడుకలో తమిళ నటుడు పార్థీబన్ చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందరినీ ఆకట్టుకుంది. చెత్తలో దొరికిన బంగారాన్ని ఎలాంటి ఆశ లేకుండా యజమానికి తిరిగి అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ఆయన ఘనంగా సత్కరించారు. ఆమెకు, కిరీటాన్ని అలంకరించి, ఆమె కాళ్లు మొక్కి గౌరవించారు.
தங்கத்தின் மதிப்பு ஏற ஏற, மனிதத்தின் மரியாதை குறைந்துகொண்டே போய், ஒரு கிராம் ஒரு லட்ச ரூபாயை நெருங்கும்போது, லட்சக்கணக்கான உயிர்கள் கொல்லப்படுவது உறுதியாகிவிடும்.
— Radhakrishnan Parthiban (@rparthiepan) February 4, 2026
வருடத்தில் 360 நாளாவது உழைக்கும் துப்புரவு பணியாளர் திருமதி பத்மா அவர்கள், குப்பையில் கிடந்த 360 கிராம் நகையை… pic.twitter.com/tTRtd6gLWP
నిజానికి సినిమా నటులు కొంతమంది కేవలం నటనద్వారనే కాకుండా తన మానవత హృదయంతో అభిమానులను సంపాదించుకున్నవారు ఉన్నారు.పలువురు నటులు తమ అభిమాన సంఘాల ద్వారా సేవలు అందిస్తున్నారు. లారెన్స్, మహేష్‌బాబు, చిరంజీవి ఇలా చాలామంది చాలా రకాల సేవలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ తమిళ హీరో చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది.తనకు దొరికిన లక్షలాది రూపాయల విలువచేసే బంగారాన్ని ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని పోగొట్టుకున్నవారికి తిరిగి ఇచ్చిన పారిశుద్ధ్య కార్మికురాలికి చెప్పులు తొడిగి మానవత్వం చాటుకున్నాడు ఆ హీరో..ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? తమిళ హీరో పార్తీబన్.
ఏం జరిగిందంటే?
చెన్నైలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ.. ఎప్పటిలాగే తన విధుల్లో భాగంగా చెత్త సేకరణ చేస్తుండగా ఆమెకు ఒక బ్యాగ్ దొరికింది. అందులో సుమారు 30 తులాల (రూ.45 లక్షల విలువ గల) బంగారు ఆభరణాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్నా సరే, ఆ బంగారాన్ని చూసి ఆమె మనసు మారలేదు. వెంటనే ఆ బ్యాగును పోలీసులకు అప్పగించి, అది అసలు యజమానులకు చేరేలా చేసింది. ఆమె నిజాయితీ గుర్తించి సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి పిలిచి సన్మానించి బంగారు గొలుసు బహుకరించారు.సూపర్ స్టార్ సన్మానించిన తర్వాత పద్మ పేరు మారుమ్రోగిపోయింది.
తాజాగా ఆమెను ఓ కాలేజీ ఈవెంట్ కు కాలేజీ వారు ఆహ్వానించారు. ఇదే ఈవెంట్ కు తమిళ్ నటుడు , దర్శకుడు పార్తీబన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అసలైన 'చీఫ్ గెస్ట్' ఆమే’ అంటూ ఆమెను వేదికపైకి ఆహ్వానించారు. అందరి సమక్షంలో ఆమెకు పాదపూజ చేసి, కొత్త చీరను బహుకరించారు. అంతేకాకుండా, ఆమె తలపైన ‘ప్రపంచ సుందరి’ (Miss World) కిరీటాన్ని పెట్టి గౌరవించారు. ఆయనే స్వయంగా ఆమెకు చెప్పులు తొడిగి ఓ చీరను బహుమతిగా ఇచ్చారు. అనంతరం ఆమె కాళ్లకు దండం పెట్టారు. "బంగారం ధర పెరుగుతున్న కొద్దీ, మానవత్వం విలువ తగ్గిపోతోంది. కానీ, పద్మ తన నిజాయితీతో ఆ మాటకు అర్థం మార్చారు. చెత్తలో దొరికిన 360 గ్రాముల బంగారాన్ని తిరిగిచ్చి, ఆమె ప్రపంచంలోనే అత్యున్నత మనిషిగా అవతరించారు. అందుకే ఆమెకు కిరీటం పెట్టి నేను గర్వపడుతున్నాను" అని రాసుకొచ్చారు.
పద్మ నిజాయితీకి ముగ్ధుడైన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల ఆమెను తన నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆమె చేసిన పనిని అభినందిస్తూ శాలువాతో సత్కరించి, ఓ బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. కాగా, అంతకుముందే పద్మ నిజాయితీని గుర్తిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆమెను పిలిపించి అభినందించడంతో పాటు, రూ. 1 లక్ష రివార్డును అందజేశారు. ఒక సామాన్య పారిశుధ్య కార్మికురాలు చూపిన నిజాయితీ, ఇప్పుడు ఆమెను సెలబ్రిటీల మన్ననలు పొందేలా చేసింది.
Follow Us