Children's Day Special:
బాల్యం...అందరికీ మరుపురాని జీవితం. అందరూ మళ్ళీ ఒక్కసారైనా వెనక్కు ఆ కాలానికి వెళ్ళాలనుకుంటారు. అలాంటి బాల్యానికి కానుకే బాలల దినోత్సవం. చాలా దేశాల్లో చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు. భారతదేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా పనిచేశారు జవహర్ లాల్ నెహ్రూ. ఆయన పుట్టిన రోజున బాలల దినోత్సవం జరుపుకుంటారు.స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ జీవితం అధిక భాగం జైళ్లలోనే గడిపారు. ఆ సమయంలో తన ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శినితో ఎక్కువకాలం గడపలేకపోయారట. నెహ్రూకి పిల్లలన్నా, గులాబీ పూలన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజున మన దేశంలో బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
Also Read: USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ
ఏఏ దేశాల్లో ఎప్పుడు బాలల దినోత్సవం..
1954 ముందు వరకూ భారతదేశంలో అక్టోబర్ నెలలో బాలల దినోత్సవం చేసుకునేవారు. అలాగే ప్రపంచమంతటా కూడా 1954 నుంచి చిల్డ్రన్ డే జరుపుకోవడం మొదలెట్టారు. అయితే తరువాత ఐక్యరాజ్యసమితి దానిని మారుస్తూ తీర్మానం చేసింది. 1989 నవంబర్ 14వ తేదీన ఓ బిల్లును ఆమోదించింది. 191 దేశాలు ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకాలు పెట్టాయి. దాని ప్రకార ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్ 20నజుపుకుంటారు. భారతదేశం కూడా దాన్నే అనుసరిస్తూ వచ్చింది. అయితే జవహర్ లాల్ నెహరూ మృతి తర్వాత దాన్ని ఆయన పుట్టిన రోజు అయిన నవంబర్ 14కు మార్చాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అప్పటి నుంచి చాచా నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా చిల్డ్రన్స్ డే నిర్వహిస్తున్నారు. అయితే చైనాలో జూన్ 1వ తేదీన, పాకిస్తాన్‌లో నవంబర్ 20వ తేదీన, జపాన్‌లో మే 5వ తేదీన, దక్షిణ కొరియాలో మే 5వ తేదీన, పోలాండ్ లో జూన్ 1వ తేదీన, శ్రీలంకలో అక్టోబర్ 1వ తేదీన ఇలా ఆయా దేశాల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
Also Read: Cricket: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం
Also Read: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?
Also Read: Movies: సూర్య కెరీర్‌లోనే అతి పెద్ద సినిమాగా కంగువ..విశేషాలివే..