Fake Bomb: బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు

ఈ మధ్య బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించింది.

Flight 3
New Update

గత కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి బెదిరింపుల చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. అలాగే తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: వాళ్లకి గుడ్‌న్యూస్.. కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు..

వినకపోతే చర్యలు

రూల్స్ ఉల్లంఘిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే థర్డ్ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే వెసులుబాటు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఇటీవల వివిధ ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్ రావడం వల్ల పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. 
 

Also Read: ప్రాణాలతో చెలగాటం..49శాతం ఫేక్ మెడిసన్స్..

250కి పైగా బాంబు బెదిరింపులు

 ఇటీవల ఢిల్లీ-హైదరాబాద్‌ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు విమానాన్ని దారి మళ్లించిన సంగతి తెలిసిందే. ఇండిగో, విస్తారా, ఆకాశ, అలియన్స్ ఎయిర్, స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌ను కూడా తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 25 విమానాలకు, ఎయర్‌ ఇండియాకు చెందిన 20 విమానాలకు అలాగే ఇతర విమానయాన సంస్థలకు ఈ బెదిరింపులు రావడం కలకలం రేపింది. గత 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 250కిపైగా బాంబు బెదిరింపులు వచ్చాయి.

Also Read :  బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు

మరోవైపు తిరుపతిలోని పలు హోటళ్లలో కూడా తాజాగా బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా హోటల్స్‌ను తనిఖీలు చేపట్టారు. అయితే ఐఎస్‌ఐ ఉగ్రవాదుల పేరుతో ఈ బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్‌పార్క్‌, పాయ్‌ వైస్రాయి హోటళ్లతో పాటు వివిధ హోటళ్లకి  కూడా బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. 

Also Read :  తగ్గేదే లే.. హైదరాబాద్ వాసులకు TGSRTC గుడ్ న్యూస్..!

#telugu-news #flights #airlines #fake-bomb
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe