/rtv/media/media_files/2025/11/02/highways-ministry-to-penalise-contractors-for-repeat-accidents-on-national-highway-stretches-2025-11-02-19-46-17.jpg)
Center's New Year gift to FASTag users.. That rule is canceled!
FASTag : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ అందించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్ల తదితర ప్రైవేట్ వాహనాల FASTag వెరిఫికేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి కొత్తగా జారీ చేసే ఫాస్ట్ ట్యాగ్ లకు కేవైవీ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్న తర్వాత వాహనదారులు పదే పదే ఫోటోలు అప్‌లోడ్ చేయడం, బ్యాంకుల చుట్టూ తిరగడం వంటి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో వాహనదారుల ఇబ్బందులు తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
📢 ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్...
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) January 2, 2026
వరుస వెరిఫికేషన్లతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇకపై ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం KYV (Know Your Vehicle) అవసరం లేదు.#FASTag#NHAI#TrafficUpdate#CentralGovt#DigitalIndia#DDNewsTelangana#TelanganaNews#TravelEasypic.twitter.com/onFK97ESmt
నిజానికి ఫాస్ట్ ట్యాగ్ కొనే సమయంలోనే వాహనదారులు అన్ని పత్రాలను సమర్పించడం అనావాయతీ. అయితే ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ అయిన తర్వాత మళ్లీ కేవైవీ వెరిఫికేషన్ పేరుతో తిరగాల్సి వచ్చేది. దీనివల్ల చాలా మందికి టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ ఇబ్బందులు ఎదురయ్యేవి. అలాగే వారి ఖాతాలు బ్లాక్ అవ్వడం వంటి సమస్యలతో పలుమార్లు ఇబ్బంది పడ్డారు. అయితే ఫిబ్రవరి 1 నుండి అమలులోకి రానున్న కొత్త రూల్స్ వల్ల ఇలాంటి ఇబ్బందుల నుంచి విముక్తి కలగనుంది. ఇకపై ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే ముందే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అంటే వాహనదారుడికి ఫాస్ట్ ట్యాగ్ అందుకున్న మరుక్షణమే అది పూర్తిస్థాయిలో పనిచేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అంతేకాక, ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ వాడుతున్న వారికి కూడా దీనివల్ల ఊరట కలగనుంది. పాత వాహనదారులు కూడా ఇకపై రెగ్యులర్‌గా KYV అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం ఫాస్ట్ ట్యాగ్ సరిగ్గా అతికించకపోయినా.. ఒక వాహనం ఫాస్ట్ ట్యాగ్ ను మరో వాహనానికి వాడినా లేదా ఏవైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని NHAI తెలిపింది. ఎటువంటి సమస్యలు లేకపోతే పాత ఫాస్ట్ ట్యాగ్స్ యథావిధిగా పనిచేస్తాయని వివరించింది. దీనివల్ల లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు "డిజిటల్ వేధింపుల" నుంచి విముక్తి లభించనుంది.
NHAI ఈ కొత్త వ్యవస్థలో పూర్తి బాధ్యతను బ్యాంకులపై ఉంచింది. ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే బ్యాంకులు వాహన్ డేటాబేస్ ద్వారా సంబంధిత వాహన వివరాలను ముందే సరిచూసుకోవాలి. ఒకవేళ వాహన్ పోర్టల్‌లో డేటా లేకపోతే మాత్రమే ఆర్సీ కాపీని తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనే ఫాస్ట్ ట్యాగ్ లకు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయని NHAI తెలిపింది. వెరిఫికేషన్ బాధ్యతను బ్యాంకులకే అప్పగించడం వల్ల వాహనదారులపై భారం తగ్గడమే కాకుండా.. టోల్ చెల్లింపులు మరింత వేగంగా, పారదర్శకగా సాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుండి ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుందని NHAI వివరించింది.
Follow Us