CBSE : టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం!

2025లో నిర్వహించబోయే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ హాల్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలంటూ CBSE ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. సీసీటీవీ పాలసీకి సంబంధించి బోర్డు నోటీసు కూడా విడుదల చేసింది.

New Update
TS Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. ఈ సారి ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

CBSE : టెన్త్, ఇంటర్ పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ సమయంలో ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరి పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2025లో నిర్వహించబోయే బోర్డు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని పాఠశాలల్లోని క్లాస్ రూముల్లో క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (CCTV) నిఘాను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే సీసీటీవీ పాలసీ బోర్డు నోటీసు విడుదల చేసింది.  

8 వేల పరీక్షా కేంద్రాలు.. 

ఇక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే అక్కడ పరీక్షలు నిర్వహించబోమని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. కొత్తగా ప్రవేశ పెట్టిన సీసీటీవీ  వ్యవస్థలో పరీక్షలు నిష్పక్షపాతంగా సాగుతాయని బోర్డు పేర్కొంది. ఇక దేశంలోని 26 రాష్ట్రాల్లో ఉన్న 8 వేల పరీక్షా కేంద్రాల్లో సుమారు 44 లక్షల మంది విద్యార్థులు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు రాయనున్నట్లు బోర్డ్ వెల్లడించింది. 

Also Read : 

Advertisment
Advertisment
తాజా కథనాలు