/rtv/media/media_files/2025/03/29/VseLtXVu10OCIjxgmgca.jpg)
yadav-court
17 ఏళ్ల నాటి అవినీతి కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ యాదవ్ నిర్దోషి అని కోర్టు తేల్చింది. 2008లో, పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు ఆమె రూ. 15 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.2008లో జరిగిన క్యాష్-ఎట్-జడ్జి డోర్ కేసులో ఆమెతో పాటుగా ఆరోపణలు ఎదురుకుంటున్న మరో ముగ్గుర్ని రవీందర్ సింగ్ భాసిన్, రాజీవ్ గుప్తా, నిర్మల్ సింగ్‌లను చండీగఢ్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు శనివారం నిర్దోషులుగా ప్రకటించింది . ఈ కేసులో మొత్తం ఐదుగురు ఆరోపణలు ఎదురుకుంటున్నారు. వారిలో ఒకరు ఇప్పటికే మరణించారు. గత గురువారం, మాజీ న్యాయమూర్తి యాదవ్‌పై సీబీఐ దాఖలు చేసిన కేసులో కోర్టు తుది వాదనలు విని, మార్చి 29ని తీర్పు ప్రకటించే తేదీగా నిర్ణయించింది.
రిటైర్డ్ జస్టిస్ నిర్మల్ యాదవ్ తరపున వాదించిన న్యాయవాది విశాల్ మాట్లాడుతూ, "లంచంగా డబ్బు పంపినట్లు తప్పుడు కథనం సృష్టించబడింది, కానీ అలాంటిదేమీ లేదు. కోర్టు ఈరోజు అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది" అని అన్నారు. ప్రత్యేక సీబీఐ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ అల్కా మాలిక్ వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
రూ. 15 లక్షల నగదు ప్యాకెట్ డెలివరీ
ఒక జడ్జికి నగదు ఇవ్వబోయి.. మరొక జడ్జికి క్యాష్ డెలివరీ చేయడంపై కేసు నమోదైంది. ఇందులో ఆ ఇదర్దు జడ్జి పేర్లు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఒకరు నిర్మలా యాదవ్ అయితే మరొకరు నిర్మలాజిత్ కౌర్. అయితే హర్యానా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్ క్లర్క్.. ఓ రూ. 15 లక్షల నగదును ప్యాక్ చేసుకుని నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తాను ఇవ్వాల్సింది జస్టిస్ నిర్మలాజిత్ కౌర్ కని కాకపోతే పొరపాటున జస్టిస్ నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు వెల్లడించాడు. అయితే ఆ ప్యాక్ తీసుకెళ్లిన అప్పటి క్లర్క్. ఈ కేసుకు సంబంధించి 2008, ఆగస్టు 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ తర్వాత మళ్లీ ఓ కీలక మలుపు తీసుకుంది. అప్పటి యూనియన్ టెర్రిటరీ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ ఆదేశాలతో ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు. దాంతో 12 రోజుల వ్యవధిలో సీబీఐ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.