కుంభమేళాలో అలా చేసిన వారిపై కఠిన చర్యలు.. పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న రెండు అకౌంట్లపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఓ ఇన్‌స్టాగ్రామ్, CCTV CHANNEL 11 అనే టెలిగ్రామ్ ఛానళ్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

New Update
Kumbh bathing photos

Kumbh bathing photos Photograph: (Kumbh bathing photos)

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అమ్ముతున్నట్లు ప్రయారం జరుగుతుంది. ట్రెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అడల్ట్ కంటెంట్ షేర్ చేసిన విజువల్స్‌ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. మహిళలు స్నానాలు చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోలు పోస్ట్ చేసిన రెండు ఇస్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానళ్లపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Zelensky: ట్రంప్‌ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్‌ స్కీ సంచలన వ్యాఖ్యలు!

@neha1224872024 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, CCTV CHANNEL 11 అనే టెలిగ్రామ్ ఛానల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అకౌంట్ నిర్వహకులను అదుపులోకి తీసుకోడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రెండు సోషల్ మీడియాలో అకౌంట్‌లో మహా కుంభ్‌లో మహిళా భక్తులు స్నానం చేస్తున్న అనుచిత వీడియోలను షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్‌లో వీడియోస్ సేల్‌కు పెట్టారు.

Also Read: Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!

 #mahakumbh2025, #gangasnan, #prayagrajkumbh వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించే ఫేస్‌బుక్ పేజీలు వీడియోలను షేర్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, తప్పుదారి పట్టించే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు