బ్రిటన్ F-35B ఫైటర్ జెట్‌కు కేరళలో మరమత్తులు

బ్రిటిష్ F-35B ఫైటర్ జెట్‌కు మరమ్మతు పనులను చేసేందుకు యూకే నుంచి 25 మంది ఇంజినీర్ల టీం ఆదివారం కేరళకు చేరుకున్నారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో వీరు ఇండియాకు వచ్చారు. దాన్ని సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ రవాణా విమానంలో తరలించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

New Update
F-35 fighter jet

జూన్‌లో జరిగిన ఇండో-యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఎఫ్‌-35బీ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో జూన్‌ 14న ఈ ఫైటర్ జెట్  కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. ఫైటర్‌ జెట్‌ మరమ్మతు పనులను చేసేందుకు యూకే నుంచి 25 మంది ఇంజినీర్ల బృందం రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో ఆదివారం కేరళకు చేరుకున్నారు. దీంతో మరమ్మతులు చేయడానికి దానిని హ్యాంగర్‌కు తరలించారు. దాన్ని సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ రవాణా విమానంలో తరలించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

అవసరమైన అన్ని మరమ్మతులు, భద్రతా తనిఖీల తర్వాత విమానం తిరిగి సేవలను ప్రారంభిస్తుందని బ్రిటిష్ హైకమిషన్ అధికారి తెలిపారు. తద్వారా ఇతర విమానాల షెడ్యూల్‌ నిర్వహణకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొన్నారు. కేరళ విమానాశ్రయంలో ఉన్న ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-35బి విమానానికి భారీ భద్రత కల్పించామని.. సాయుధ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కాపలాగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. 

Advertisment
తాజా కథనాలు