BIG BREAKING : కేంద్రం గుడ్ న్యూస్.. ఒక్కో ఉద్యోగి అకౌంట్లోకి రూ. 17 వేలు

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.  గ్రూప్ సి, గ్రూప్ డి స్థాయి ఉద్యోగులకు ప్రభుత్వం ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB)ను ప్రకటించింది. 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్‌ను ప్రభుత్వం ఆమోదించింది.

New Update
BREAKING

BREAKING

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.  గ్రూప్ సి, గ్రూప్ డి స్థాయి ఉద్యోగులకు ప్రభుత్వం ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB)ను ప్రకటించింది. 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్‌ను ప్రభుత్వం ఆమోదించింది.లోకో పైలట్‌లు, గార్డ్‌లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్ వైజర్లు, టెక్నీషియన్లు, ట్రాక్ మెయింటెయినర్లు, పాయింట్స్‌మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్-సి, డి ఉద్యోగులకు ఈ బోనస్ వర్తిస్తుంది.

ఒక్కో ఉద్యోగికి రూ. 17 వేల 951

ఈ బోనస్ కోసం రైల్వే శాఖ సుమారు రూ. 2029 కోట్లు ఖర్చు చేయనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ. 17 వేల 951 వరకు అందనున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 11 లక్షల మందికి పైగా నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.

ఈ బోనస్ సాధారణంగా దసరా/దుర్గాపూజ పండుగలకు ముందు చెల్లిస్తారు. రైల్వే ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను ప్రోత్సహించడానికి ఈ బోనస్ ఇస్తారు. అయితే, బోనస్ లెక్కింపునకు సంబంధించి 6వ వేతన సంఘం ప్రకారం రూ. 7000 ప్రాతిపదికన లెక్కించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 7వ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం రూ. 18,000గా ఉందని, దాని ఆధారంగా బోనస్ లెక్కించాలని డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వం మాత్రం పాత విధానాన్ని కొనసాగించింది.

Advertisment
తాజా కథనాలు