Karnataka: మిస్సైనా కోటీశ్వరుడి శవం దొరికింది!

కర్ణాటకలో ఆదివారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, మిస్బా గ్రూప్‌ విద్యాసంస్థల అధినేత బీఎం ముంతాజ్‌ అలీ శవాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆయన మృతదేహాన్ని ఫాల్గుణి నది ముఖ ద్వారం వద్ద కనుగొన్నారు.

New Update
bm

Karnataka: కర్ణాటకలో ఆదివారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, మిస్బా గ్రూప్‌ విద్యాసంస్థల అధినేత బీఎం ముంతాజ్‌ అలీ (52) వ్యవహారం విషాందాంతం అయ్యింది. దాదాపు కొన్ని గంటల పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా..ఆయన మృతదేహాన్ని ఫాల్గుణి నది ముఖ ద్వారం వద్ద కనుగొన్నారు.

Also Read: జమ్మూలో అధికారం దిశగా కాంగ్రెస్ కూటమి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఆయన తన కూతురితో చివరిసారిగా మాట్లాడారు. దాంతో వెంటనే అప్రమత్తమైన ఆయన కుమార్తె..పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: రెండు స్థానాల్లో ఒమర్ అబ్ధుల్లా ముందంజ

దీంతో కావూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అలీని డబ్బుల కోసం బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేసిన ఆరోపణలపై ఓ మహిళతో పాటు మరో ఆరుగురిని నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అదృశ్యమైన అలీ ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో పాటు మంగళూరు మాజీ ఎమ్మెల్యే మెయిదీన్‌కు సమీప బంధువు కావడంతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేగింది.

Also Read:  పుంజుకున్న బీజేపీ.. ఇక!

దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని అలీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కల్లూరు వంతెన సమీపంలో ధ్వంసమైన అతని కారును పోలీసులు కనుగొన్నారు. తర్వాత ఫాల్గుణి నది ముఖ ద్వారం వద్ద అతని మృతదేహాన్ని కనుగొన్నారు. అలీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏజే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: అజ్మేర్‌ లో  విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం..ఒకరి మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు