శ్రీహరికోటలో 'బ్లూ బర్డ్ బ్లాక్-2' ప్రయోగం.. ‘No Signal‘ అనే మాటే ఉండదు!

ఇస్రో బ్లూ బర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాలను బుధవారం శ్రీహరికోటలోని షార్ నుంచి నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో తన నమ్మకమైన PSLV రాకెట్‌ను ఉపయోగిస్తోంది. దీంతో ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్‌నెట్ సిగ్నల్ అందుతుంది.

New Update
Blue Bird Block 2

చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవిలో కూడా ఇకపై హలో అనవచ్చు. ఎడారి, హిమాలయాలు ఇలా ఎక్కడైనా సరై సిగ్నల్ లేదు అనే మాట మీ నోట రాదు. ఆ దిశగా అంతరిక్ష సాంకేతికతలో విప్లవాత్మక మార్పుల కోసం ఇస్రో ప్రయోగం చేపట్టింది. బ్లూ బర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాలను బుధవారం శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో తన నమ్మకమైన PSLV రాకెట్‌ను ఉపయోగిస్తోంది.

బ్లూ బర్డ్ బ్లాక్-2 స్పెషాలిటి..

ఈ ఉపగ్రహాలు ప్రధానంగా గ్లోబల్ కనెక్టివిటీ, డైరెక్ట్-టు-సెల్ సాంకేతికతను మెరుగుపరచడానికి ఉద్దేశించినవి. మారుమూల ప్రాంతాల్లో, సిగ్నల్స్ లేని చోట కూడా నేరుగా మొబైల్ ఫోన్లకు 5G ఇంటర్నెట్ మరియు కాలింగ్ సేవలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ఉపగ్రహాల్లో అత్యంత భారీ, అధునాతనమైన యాంటెన్నాలను అమర్చారు. ఇవి అంతరిక్షం నుండి భూమిపై ఉన్న చిన్న మొబైల్ సిగ్నళ్లను కూడా సులభంగా క్యాచ్ చేయగలవు. 

రెండవ దశ: గతంలో ప్రయోగించిన బ్లాక్-1 విజయవంతం కావడంతో, మరింత మెరుగైన వేగం, సామర్థ్యంతో బ్లాక్-2 వెర్షన్‌ను సిద్ధం చేశారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోటలో బుధవారం మధ్యాహ్నం వాతావరణ పరిస్థితుల బట్టి ఇస్రో ఖరారు ఈ రాకెట్ లాంచ్ చేయనుంది. ప్రయోగానికి 24 గంటల ముందు నుండే కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రాకెట్ ఇంజిన్ పరీక్షలు, ఇంధనం నింపడం వంటి పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేస్తారు.

భారత్‌కు దక్కుతున్న గుర్తింపు

ప్రపంచవ్యాప్త వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగానికి భారత్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారింది. తక్కువ ఖర్చుతో, అత్యధిక విజయాల రేటు ఉండటంతో అంతర్జాతీయ సంస్థలు తమ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రోను ఎంచుకుంటున్నాయి. బ్లూ బర్డ్ బ్లాక్-2 విజయం సాధిస్తే, అంతరిక్ష ఆధారిత మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో కొత్త శకం ప్రారంభం కానుంది. షార్ శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు వాతావరణం అనుకూలిస్తే, మరోసారి భారత గడ్డపై నుండి ఒక భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ విజయవంతంగా నింగిలోకి ఎగరనుంది.    

Advertisment
తాజా కథనాలు