Tamil Nadu : కరుణానిధి సమాధిపై గుడి గోపురం.. DMKపై BJP ఫైర్

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సమాధిపై శ్రీవిల్లిపుత్తూరు గుడి గోపురం నమూనాను ప్రతిబింబించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఎంకే హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

New Update
 Karunanidhi's memorial

Karunanidhi's memorial

చెన్నైలోని మెరీనా బీచ్‌లో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సమాధిపై శ్రీవిల్లిపుత్తూరు గుడి గోపురం నమూనాను ప్రతిబింబించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఎంకే హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గోపురం నమూనాను ఓ సమాధిపై ఎలా పెడతారు? ఇది అహంకారం, మూర్ఖత్వానికి నిదర్శనమని అయన  అభిప్రాయపడ్డారు. ఇది హిందూ మనోభావాలను అవమానించడమేనని అన్నారు.  హిందువుల సెంటిమెంట్లతో ఆడుకుంటున్న బీజేపీ మూల్యం చెల్లించుకుంటుందని వ్యాఖ్యానించారు. దానిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.  

పరిమితులు దాటి ప్రవర్తిస్తూ

ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో హిందూ మత, ధర్మాదాయ ధార్మిక మంత్రి పికె శేఖర్ బాబు పరిమితులు దాటి ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ, బీజేపీ  రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె అన్నామలై కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవుడిపై విశ్వాసం లేదని చెప్పుకునే డీఎంకే చాలా కాలంగా హిందువుల విశ్వాసాలను దెబ్బతీస్తూ జీవనోపాధి పొందుతోంది" అని అన్నామలై అన్నారు.  మరోవైపు తమిళనాడు రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్రలో కరుణానిధి స్థాయిని గౌరవప్రదంగా అభినందించడమే ఈ స్మారక చిహ్న అలంకరణ ఉద్దేశమని, మతపరమైన ప్రకటన కాదని డీఎంకే మద్దతుదారులు వాదిస్తున్నారు. కాగా కరుణానిధి స్మారక చిహ్నం వివాదానికి దారితీయడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్ 2023లో, HR&CE విభాగం ఏర్పాటు చేసిన ఇలాంటి గోపుర ప్రతిరూపం హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంది. 

Also Read :  అఘోరీ ముల్లు లేని మగాడు.. ఆ పార్ట్ ఎందుకు లేదో మొత్తం చెప్పేసిన అన్వేష్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు