BJP: ప్రియాంకా గాంధీ ఓ శూర్పణఖ.. సుబ్రమణ్య స్వామి వివాదాస్పద పోస్ట్!

వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయడంపై బీజేపీ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలను రాక్షసులతో పోలుస్తూ ట్వీట్ చేశారు. ఓడిపోవడానికే ప్రియాంకను అక్కడ దింపుతున్నారని అర్థం వచ్చేలా రాశారు. 

New Update
12

BJP Senoir leader Subrahmanya swami: 


బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి...ఎప్పుడూ కాంట్రవర్శీగా ఎదో ఒకటి మాట్లాడుతుంటారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన.  తాజాగా కాంగ్రెస్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి  ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రాక్షసులు చేసి పడేశారు. ప్రస్తుతం వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్, రాయబరేలీ రెండింటి నుంచీ పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు కూడా. అయితే ఆయన తరువాత ఇందులో ఒక స్థానాన్ని వదులుకోవలసి వచ్చింది. అప్పుడు రాబరేలీని ఎచుకుని, వయనాడ్‌ను వదిలేసారు. ఈ నేపథ్యంలో వయనాడ్‌లో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ సారి బరిలోకి కాంగ్రెస్ ప్రియాంకాగాంధీని దింపింది. ఈమె ప్రత్యక్ష్యంగా ఎన్నికల బరిలోకి దగడం ఇదే మొదటిసారి. ఇప్పడు ఈ విషయం మీదనే సుబ్రహ్మణ్యస్వాి ట్వీట్ చేశారు. 

రాముడిని ఓడించడానికి రావణుడు శూర్పణఖను వాడుకున్నాడు. కంసుడి కోసం కృష్ణుడు పూతనను..ప్రహ్లాదుడి కోసం హిరణ్యకశిపుడు హోలికను వాడుకున్నట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ వాయనాడ్ ఎన్నికల్లో తన చెల్లెలు ప్రియాంకా గాంధీని వాడుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత. దీని దవారా పరోక్షంగా ఆయన బీజేపీనే గెలుస్తుందని చెప్పనట్టు అయింది. బీజేపీని ఓడించలేరు సరికదా...తమను తామే నాశన చేసుకుంటున్నారు అని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు సుబ్రహ్మణ్యస్వామి. మూడు రోజుల క్రితం చేసిన ఈ ట్వీట ఇప్పుడు వైరల్ గా మారింది. 

Also Read: USA:గెలుపు కోసం పట్టుదలగా ఉన్న ట్రంప్..5వేల మంది లాయర్ల నియామకం

Advertisment
తాజా కథనాలు