USA:గెలుపు కోసం పట్టుదలగా ఉన్న ట్రంప్..5వేల మంది లాయర్ల నియామకం అమెరికాలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. కొన్ని గంటల్లో ఫలితాలుకూడా తెలిసిపోతాయి. ఈ నేపథ్యంలో చాలా కీలక విషయాలు తెలుస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ట్రంప్ దాదాపు 5 వేల మంది లాయర్లను నియమించుకున్నట్లు సమాచారం . By Manogna alamuru 05 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Donald Trump: 2020 ఎలక్షన్ల తర్వాత ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి ఎన్నికల ప్రక్రియలో అవకతకలు చోటు చేసుకున్నాయని అన్నారు. తన తరుఫున చాలా రాష్ట్రాల్లో లాయర్లతో పిటిషన్లు కూడా వేయించారు కూడా. అయితే తరువాతి కాలంలో సాక్ష్యాలు లేకపోవడంతో వాటిని తిస్కరించారు. ఇప్పుడు వాఇని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఈసారి ఎలక్షన్ల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం 5 వేలమంది లాయర్లను నియమించుకున్నారని చెబుతున్నారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడం, అవకతవకలపై ప్రతిస్పందనలను సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియను ఈ లాయర్లు దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఒకవేళ ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు వ్యతిరేకంగా వస్తే...వెంటనే కోర్టులో సవాల్ చేసేందుకు ఈ లాయర్లు అంతా రెడీ గా ఉంటారు. ఇక అమెరికా ఎన్నికల విషయానికి వస్తే ఈ సారి ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. చివర వరకూ ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టంగా మారింది. నిన్నటి వరకూ ట్రంప్ ఆధిక్యంలో ఉంటే...ఈరోజు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఒక్కసారి కమలా హారిస్ పైకి వచ్చేశారు. ప్రస్తుతం కమలా హారిసే అధ్యక్ష పీఠం ఎక్కుతారని సర్వలు చెబుతున్నాయి. అయితే మరికొన్ని గంటల్లో ఎవరు గెలిచారన్నది క్లియర్‌గా తెలిసిపోతుంది. Also Read: USA: అమెరికాలో మొదలైన పోలింగ్.. రాష్ట్రాల వారీగా టైమింగ్స్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి