BJP MP Ravi Kishan : నిన్ను చంపేస్తాం.. ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు

బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు రవి కిషన్‌ శుక్లాకు ఫోన్ ద్వారా మరణ బెదిరింపులు వచ్చాయి. ఇటీవల బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలకు సంబంధించి, గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

New Update
ravi

బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు రవి కిషన్‌ శుక్లాకు ఫోన్ ద్వారా మరణ బెదిరింపులు వచ్చాయి. ఇటీవల బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలకు సంబంధించి, గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బిహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రవి కిషన్‌ చేసిన ప్రసంగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.ఈ విషయంపై ఎంపీ రవి కిషన్‌ వ్యక్తిగత కార్యదర్శి శివమ్ ద్వివేది గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్ తాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 302 (హత్య), 351(3), 352 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ బెదిరింపులకు భయపడను

బెదిరించిన వ్యక్తి రవి కిషన్‌పై వ్యక్తిగతంగానే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులపై, అలాగే మత విశ్వాసాలపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై రవి కిషన్‌ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "నా తల్లిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు, మరణ బెదిరింపులు ఇచ్చారు. శ్రీరాముడి గురించి కూడా అభ్యంతరకర పదాలు వాడారు. ఇది కేవలం నా వ్యక్తిగత గౌరవంపై దాడి కాదు, మన నమ్మకాలు, భారతీయ సంస్కృతిపై దాడి" అని పేర్కొన్నారు. ఈ బెదిరింపులకు తాను భయపడబోనని, జాతీయవాదం, ధర్మం మార్గంలో స్థిరంగా ఉంటానని రవి కిషన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు.

 నిందితుడు బిహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్‌ కుమార్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
తాజా కథనాలు