40 ఏళ్ల నిరీక్షణ .. బీహార్ మహిళకు భారత పౌరసత్వం

బీహార్‌లోని అరా నగరంలో 40 ఏళ్లుగా నివసిస్తున్న సుమిత్రా ప్రసాద్ అలియాస్ రాణి సాహా అనే మహిళకు భారత ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది. సుమిత్ర 1985 నుంచి బంగ్లాదేశ్ వీసాపై భారత్‌లో నివసిస్తున్నారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

New Update
caa act bihar women

caa act bihar women Photograph: (caa act bihar women)

బీహార్‌లోని అరా నగరంలో 40 ఏళ్లుగా నివసిస్తున్న సుమిత్రా ప్రసాద్ అలియాస్ రాణి సాహా అనే మహిళకు భారత ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (CAA), సంబంధిత నిబంధనల ప్రకారం బిహార్‌లో పౌరసత్వం మంజూరు  చేసింది.  ఆరాలోని చిత్రతొలి రోడ్డులో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నడుపుతున్న సుమిత్ర 1985 నుంచి బంగ్లాదేశ్ వీసాపై భారత్‌లో నివసిస్తున్నారు.  

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సుమిత్ర ఇలా అన్నారు.  “నాకు ఐదేళ్ల వయసులో నేను బంగ్లాదేశ్‌లోని మా అత్త ఇంటికి వెళ్లాను. 1985లో నేను ఇండియాకు తిరిగి వచ్చే సమయానికి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.  అప్పటి నుంచి నేను ఇక్కడే నివసిస్తున్నాను, కానీ ఇప్పుడు నాకు పౌరసత్వం లభించింది.  ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని సుమిత్రా ప్రసాద్ చెప్పుకొచ్చారు. సిటిజన్‌షిప్ రూల్స్, 2009లోని రూల్ 11A , రూల్ 13Aలోని సబ్-రూల్ (1) ప్రకారం రాష్ట్ర స్థాయి సాధికార కమిటీ కింద ఆమె పౌరసత్వం చివరకు ఆమోదించబడింది. 

వీసాను పదే పదే రెన్యువల్

1985 నుంచి బీహార్‌లో ఉంటున్న  సుమిత్రా ప్రసాద్ భారత్ లో ఉండేందుకు తన వీసాను పదే పదే రెన్యువల్ చేయాల్సి వచ్చింది.   బంగ్లాదేశ్‌లోని తన అత్త ఇంటికి వెళ్లినప్పుడు సుమిత్రకి 5 సంవత్సరాలు.  ఆ సమయంలో బంగ్లాదేశ్ ఇంకా ప్రత్యేక దేశంగా ఏర్పడలేదు.  మేనత్త ఇంట్లో ఉంటూనే చదువు పూర్తి చేసుకుని 1985లో ఇండియా వచ్చింది.1985 తర్వాత సుమిత్ర బంగ్లాదేశ్ కు వెళ్లలేదు.   ఇండియాకు  తిరిగి వచ్చిన తర్వాత బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లినట్లు సాహా తెలిపింది.

మార్చి 10, 1985న, ఆరాలోని చిత్రతోలి రోడ్‌లో పరమేశ్వర్ ప్రసాద్‌తో ఆమె వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు, 2010లో, ఆమె భర్త ఎముక క్యాన్సర్‌తో మరణించాడు.   ఆ తర్వాత సుమిత్ర తన కుటుంబంతో అరాహ్‌లో నివసించడం ప్రారంభించింది. సాహాకు ముగ్గురు కుమార్తెలు ప్రియాంక ప్రసాద్, ప్రియదర్శిని, ఐశ్వర్య.  పౌరసత్వ సవరణ చట్టం గురించి తెలుసుకున్న సుమిత్ర కుమార్తె ఐశ్వర్య ప్రసాద్ CAA కోసం దరఖాస్తు చేసింది. ఇంతలో, ఆమెకు మూడేళ్ల వీసా పొడిగింపు కూడా వచ్చింది. ఐశ్వర్య అక్టోబర్ 2024లో CAA కోసం దరఖాస్తు చేయగా తాజాగా దానికి ఆమోద ముద్ర పడింది.  

Also Read :  Bengaluruలో విషాదం.. పిల్లలకు విషం ఇచ్చి.. భార్యాభర్తలు ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు