USA: అమెరికాలో అంతుచిక్కని అందాలు..ఫాల్ కలర్స్!

అమెరికాలోని అద్భుతాల్లో ఒకటి ఫాల్ కలర్స్. పచ్చని ఆకులు పువ్వులుగా మారిన వేళ..రంగులు సంతరించుకుని మెరిసే వింత ఇది. నెలరోజుల పాటూ కనువిందు చేసే ఈ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

New Update

FAll colors Or Autmn Season: 

చెట్ల ఆకులు మెల్లగా ఆకుపచ్చ నుంచి పసుపులోకి మారుతాయి. ఆ తర్వాత నారింజ.. ఆ వెంటనే ఎరుపు రంగులు పులుముకుంటూ ఉంటాయి. ఉన్నట్టుండి ఒక రాత్రి గాలివాన వీస్తుంది. ఆ ఒక్క విసురుకి ఆకులు రాలిపడతాయి. ఇదంతా అమెరికా గురించి చెబుతున్న మాటలు. ఆకాలు రాలడాన్ని అమెరికలో ఫాల్‌ అని పిలుస్తారు. రంగురంగుల ఆకులు రాలి పడతాయి కాబట్టి దీన్ని ఫాల్ కలర్స్‌ అని పిలుస్తారు.

అసలు ఈ ఆకులు ఎందుకు రంగు మారుతాయి? నిజానికి ఆకుల్లోని క్లోరోఫిల్ నిరంతరం ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత అది బ్రేక్ అవుతుంది. అప్పుడు ఆకులు ఆకుపచ్చగా కనిపిస్తాయి. శరదృతువులో రాత్రి పొడవు పెరిగే కొద్దీ, క్లోరోఫిల్ ఉత్పత్తి మందగిస్తుంది. ఒక సమయంలో ఆ ఉత్పత్తి ఆగిపోతుంది. చివరికి మొత్తం క్లోరోఫిల్ నాశనం అవుతుంది. ఆకులో ఉండే కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్ ముసుగులు తీసి వాటి రంగులను చూపుతాయి.

శరదృతువులో చెట్లలో సంభవించే మార్పులను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మూడు కారణాలు శరదృతువు ఆకు రంగును ప్రభావితం చేస్తాయి. అందులో ఒకటి ఆకు వర్ణద్రవ్యాలు, రెండోది రాత్రి పొడవు, మూడోది వాతావరణం. ఇక కెరోటినాయిడ్లు ఏడాది పొడవునా ఆకులలో ఉంటాయి. అయితే అవి సాధారణంగా ఆకుపచ్చగా కనిపిస్తాయి. శరదృతువు సమీపిస్తున్న సమయంలో ఆకుల్లోకి వెళ్లే క్లోరోఫిల్స్ సరఫరా క్రమంగా క్షీణిస్తుంది. అప్పుడు ఆకు కణాలలో ఉన్న ఇతర వర్ణద్రవ్యాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇవి పసుపు, గోధుమ, నారింజ లాంటి అనేక రంగుల రంగులను అందిస్తాయి.

ఇక అలబామా ఫాల్ కలర్ సాధారణంగా అక్టోబర్ ప్రారంభం నుంచి నవంబర్ మొదటి వారం వరకు కనిపిస్తుంది. ఇది ముందుగా ఉత్తర అలబామాలో ప్రారంభమవుతుంది. ఇక అర్కాన్సాస్‌-బఫెలో నేషనల్ రివర్ వద్ద ఈ కాలంలో కనిపించే రంగురంగుల ఆకుల దృశ్యాలను ఎంతసేపు చూసినా చూడలనిపిస్తూనే ఉంటుంది.

Also Read: Crime:పశ్చిమ బెంగాల్‌లో దారుణం..వైద్యం కోసం వచ్చిన మహిళపై అత్యాచారం

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు