Mpox ఎఫెక్ట్.. బెంగళూరు విమానాశ్రయంలో 2,000 మందికి పరీక్షలు!

ఎంఫాక్స్ వ్యాప్తి నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో మొదటి కేసు నమోదైన తర్వాత ఎయిర్ పోర్ట్ సిబ్బందితోపాటు ప్రయాణికులకు పరీక్షలను తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ సుమారు 2,000 మందిని పరీక్షించినట్లు వెల్లడించింది.

Mpox
New Update

Bengaluru Airport: ఎంఫాక్స్ వ్యాప్తి నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయం అధికారులు అప్రమత్త మయ్యారు. ఢిల్లీలో మొదటి కేసు నమోదైన తర్వాత ఎయిర్ పోర్ట్ సిబ్బందితోపాటు ప్రయాణికులకు పరీక్షలను తప్పనిసరి చేసింది. కర్ణాటకలో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కఠినమైన ఐసోలేషన్ చర్యలతో ప్రతిరోజూ సుమారు 2,000 మంది ప్రయాణికులను పరీక్షించినట్లు వెల్లడించింది. 

ఈ మేరకు బెంగుళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ పరీక్ష తప్పనిసరి చేసింది. ఢిల్లీలో మొదటి కేసు నమోదైన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది సూచించారు. ప్రతి అంతర్జాతీయ ప్రయాణీకుడు పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం 4 ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేశాం. ప్రతిరోజూ సుమారు 2,000 మంది ప్రయాణికులను పరీక్షలు నిర్వహిస్తున్నాం. స్క్రీనింగ్, టెస్టింగ్, ట్రాకింగ్ అంతటా సజావుగా జరిగేలా చూస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించినట్లు కర్నాటక ప్రభుత్వం తెలిపింది.

#bangalore #mpox
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe