Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు.. లిస్ట్ ఇదే..!

ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. మొత్తంగా శని, ఆదివారాలు కలుపుకొని 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా ఈ సెలవులు మారతాయి.

New Update
Bank Holidays : మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు.. అలర్ట్‌!

బ్యాంకుకు వెళ్లి ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు కచ్చింతగా బ్యాంకులు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి? ఏ రోజుల్లో మూసి ఉంటాయి? అనే వివరాలు గ్యారంటీ తెలుసుకుని వెళ్లాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఫిబ్రవరి, 2025కు సంబంధించిన బ్యాంక్ హాలీడేస్ జాబితాను విడుదల చేసింది. జాతీయ సెలవులతో పాటుగా రాష్ట్రాల వారీగా వేరు వేరు రోజుల్లో హాలీడేస్‌ ఉంటాయి. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరోజు బ్యాంకులు మూతపడతాయి.

అందుకే తమ రాష్ట్రంలో ఏ రోజు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోవాలి. ఫిబ్రవరి నెలలో ప్రధానంగా సరస్వతి పూజ, థాయ్ పూసమ్, గురు రవి దాస్ బర్త్ డే, లుయ్ గయి ని, ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి, రాష్ట్ర అవతరణ దినోత్సవం, మహాశివరాత్రి వంటి పర్వదినాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 2025 బ్యాంక్ సెలవులు...
ఫిబ్రవరి 2వ తేదీ: ఆదివారం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు మామూలు సెలవు 
ఫిబ్రవరి 3వ తేదీ: సోమవరాం సరస్వతి పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు హాలీడే
ఫిబ్రవరి 8వ తేదీ: రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలీడే
ఫిబ్రవరి 9వ తేదీ: ఆదివారం కావడంతో బ్యాంకులు సెలవు
ఫిబ్రవరి 11వ తేదీ: థాయ్ పూసమ్ సందర్భంగా తమిళనాడు బ్యాంకులు హాలీడే
ఫిబ్రవరి 12వ తేదీ: గురు రవి దాయ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు మూసే ఉంటాయి.
ఫిబ్రవరి 15వ తేదీ: లూయి నగై ని సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులను మూసివేస్తారు

ఫిబ్రవరి 16వ తేదీ: ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
ఫిబ్రవరి 19వ తేదీ: ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఈ రోజు మహారాష్ట్రలో సెలవు ఉంటుంది
ఫిబ్రవరి 20వ తేదీ: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 22వ తేదీ: నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు మామూలు సెలవే ఉంటుంది.
ఫిబ్రవరి 23వ తేదీ: ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
ఫిబ్రవరి 26వ తేదీ: మహాశివరాత్రి సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఇస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో సెలవులు ఇవి..

ఫిబ్రవరి నెలలో తెలంగాణ, ఏపీలో బ్యాంకులకు ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా బుధవారం సెలవు గా ప్రకటించారు. మిగిలిన ఫిబ్రవరి 2, 8, 9, 16, 22, 23 తేదీల్లో రెండో, నాలుగో శనివారం, ఆదివారాలు ఉన్నందున సాధారణ సెలవు ఉంటుంది. అంటే మొత్తంగా 7 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.

అయితే, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యాప్ ఆధారిత డిజిటల్ సేవలు కొనసాగుతాయి. వాటిల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. అయితే బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు ఉంటే సెలవు దినాలను చూసుకుని బ్యాంకులకు వెళ్లాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు