దీపావళి సందర్భంగా అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్షలాది దీపాల కాంతులతో ఆ ప్రాంతం వెలిగిపోయింది. రామమందిరం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు ఇవే కావడం విశేషం. ఈ దీపోత్సవ వేడుక రెండు గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకుంది. సరయూ నది తీరంలో అత్యధికంగా సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఏకకాలంలో దీపాలతో హరతిని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.
Also Read: టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు.. 24 మంది సభ్యులతో కొత్త బోర్డు
55 ఘాట్‌లు
అలాగే యూపీ ప్రభుత్వం, టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 25,12,585 దీపాలను భక్తులు వెలిగించి రికార్డు నెలకొల్పారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను అయోధ్య దీపోత్సవానికి మరో గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది. మొత్తంగా 55 ఘాట్‌లలో ఏర్పాటు చేసిన దీపాలను ప్రత్యేక డ్రోన్లతో గిన్నీస్ ప్రతినిధులు లెక్కించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌కు సంబంధించి రెండు సర్టిఫికేట్లను సీఎం యోగీ ఆదిత్యనాథ్ అందుకున్నారు.
మొత్తం 25 లక్షల దీపాలను వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహకులు.. ముందుగానే 28 లక్షల దీపాలను ఆర్డర్ చేశారు. రామమందిరంతో పాటుగా ఇతర పరిసర ప్రాంతాలను ప్రమిదలతో అలంకరించారు. దాదాపు 30 వేల మంది వాలంటీర్లు ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ ఘాట్ వద్ద ఏకంగా 80 వేల దీపాలతో స్వస్తిక్ ఆకారంలో ప్రమిదలను వెలిగించడం అందరినీ ఆకట్టుకుంది.
Also Read: చైనాలో జనాభా సంక్షోభం.. మహిళలకు ప్రభుత్వం కీలక సూచనలు
సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు ఈ హరతి కార్యక్రంలో పాల్గొన్నారు. మయన్మార్, నేపాల్, మలేసియా, కంబోడియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన వివిధ కళాకారులతో వేదిక వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఘాట్‌ల వద్ద దాదాపు 5 వేల నుంచి 6 వేల మంది అతిథుల కోసం ఏర్పాట్లు చేశారు. మరోవైపు లైవ్ కవరేజి కోసం పెద్ద పెద్ద తెరలు కూడా ఏర్పాటు చేశారు. అయోధ్య నగరమంతా దాదాపు 10 వేల భద్రతా సిబ్బందిని మోహరించారు.