చైనాలో జనాభా సంక్షోభం.. మహిళలకు ప్రభుత్వం కీలక సూచనలు

చైనాలో గత కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం.. ఆ దేశ మహిళలకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మహిళలను గర్భం దాల్చాలని, పిల్లల్ని కని జనాభా రేటును పెంచాలని చెబుతోంది.

New Update
China

చైనాలో గత కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం కొనసాగుతోంది. వృద్ధుల సంఖ్య అక్కడ ఏటా పెరిగిపోతోంది. జననాల రేటు తగ్గిపోవడంతో అక్కడ పరిస్థితులు ఆందోళకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం.. ఆ దేశ మహిళలకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మహిళలను గర్భం దాల్చాలని, పిల్లల్ని కని జనాభా రేటును పెంచాలని చెబుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి చైనా మార్నింగ్ పోస్టులో ఓ కథనం వచ్చింది.  

Also Read: డేగలా కమ్మేస్తాం..ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ హెచ్చరిక

ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రావిన్స్ ఫుజియనాన్‌లో జేన్ హువాంగ్ అనే 35 ఏళ్ల మహిళకు ఇటీవల ఓ అధికారి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆ అధికారి మాట్లాడుతూ ఆమె వ్యక్తిగత వివరాలు సేకరించారు. అలాగే ఆమెను పిల్లలను కూడా కనాలని సూచించారు. అలాగే ఆ దేశ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ అయిన జియాహోంగ్షులో ఓ పోస్ట్‌ వైరల్ అయ్యింది. ఆ పోస్టులో కూడా ఓ మహిళ తనకు కూడా ఇలాంటి ఫోన్‌కాల్‌ వచ్చిందని చెప్పింది. దీంతో ఇలా అధికారులు మహిళలకు ఫోన్లు చేసి పిల్లల్ని కనాలని చెప్పడం చర్చనీయాంశమవుతోంది.  

90 లక్షల జననాలే

చైనా జనాభా వరుసగా రెండో ఏడాది కూడా పడిపోయింది. దీంతో వారి జనాభా 140 కోట్లకు చేరుకుంది. గత ఏడాది జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు కూడా తగ్గినట్లు అధికారులు అంచనా వేశారు. 2023లో 90 లక్షల జననాలు మాత్రమే జరిగాయి. అయితే 1949 నుంచి ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జనాభా పరంగా చైనా ప్రస్తుతం రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జనానాలు, సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోతుంటే మరోవైపు వృద్ధుల జనాభా కూడా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2023 నాటికి చైనాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకుంది. 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు చేరుకుంటుందని.. 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని తాజాగా ఓ నివేదిక అంచనా వేసింది.

Also Read: ట్రంప్ గెలిస్తే వీసాలు టైట్..ఐటీ కష్టాలు మళ్ళీ మొదటికి

పాఠశాలలు మూసివేత

ఇలా జననాల రేటు తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేస్తున్నారని మరో నివేదిక తెలిపింది. 2023లో చూసుకుంటే చైనావ్యాప్తంగా 14,808 కిండర్‌ గార్డెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజా రిపోర్టు వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య 2022తో పోలిస్తే ఏకంగా 11 శాతం తగ్గింది. అందువల్లే ఇలా పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రాథమిక పాఠశాలలపై కూడా ఈ ప్రభావం పడింది. 2023లో ఏడాదిలో 5,645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.  

 

Advertisment
Advertisment
తాజా కథనాలు