మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ షురూ

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఈరోజు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు జార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

New Update
Parliament's special session: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్.. బిల్లుకు ముహూర్తం ఫిక్స్!

Maharastra Elections: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత పోలింగ్ జరుగుతోంది. మహాయుతి, మహా అఘాడీ మధ్య తీవ్ర పోరు నెలకొంది. 9.7 కోట్ల మంది ఓటర్లు  ఓటింగ్‌లో పాల్గొనున్నారు. ఓటర్ల కోసం లక్షా 186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఉదయం ప్రారంభమైన ఈ పోలింగ్ సా.6 గంటల వరకు జరగనుంది. మహాయుతిలో 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా..  శివసేన 81 స్థానాల్లో, ఎన్సీపీ 59 చోట్ల పోటీ చేస్తోంది. అలాగే కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. శివసేన ( ఉద్ధవ్) 95, ఎన్సీపీ(ఎస్‌పీ) 86 చోట్ల పోటీ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో చిన్న పార్టీలు తీవ్ర ప్రభావం చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

జార్ఖండ్ లో 2వ విడత...

జార్ఖండ్ రెండో విడతలో 38 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 38 స్థానాల్లో బరిలో 522 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. తొలి విడతలో ఈ నెల 13న 43 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 సీట్లు ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో 9 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో కైవసం చేసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా మైక్ సెట్లతో.. నేతల ప్రచారాలతో హోరెత్తిన  రెండు రాష్ట్రాలు ఇప్పుడు మూగబోయాయి. ఆ ఎన్నికల పండుగ వాతావరణం ముగిసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ నెల 23న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

Advertisment
తాజా కథనాలు