Sambhal: సంభాల్‌లో బయటపడ్డ మెట్లబావి.. యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌లోని చందౌసి జిల్లా సంభాల్‌లో ఇటీవల మెట్ల బావి బయటపడిన సంగతి తెలిసిందే. గతవారం బయటపడ్డ ఈ మెట్లబావి 125 నుంచి 150 ఏళ్ల కాలం నాటిదని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు యోగీ సర్కార్ సంభల్‌ను తీర్థయాత్ర స్థలంగా మార్చేందుకు ప్రణాళికలు వేస్తోంది.

New Update
Step Wall And Yogi Adityanath

Step Wall And Yogi Adityanath

ఉత్తరప్రదేశ్‌లోని చందౌసి జిల్లా సంభాల్‌లో ఇటీవల మెట్ల బావి బయటపడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న తవ్వకాల పనులు ప్రారంభం కాగా నేటితో ఐదో రోజు పనులు కొనసాగుతున్నాయి. అయితే అర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు జరుగుతున్న పనులను పరిశీలించేందుకు తాజాగా ఘటనాస్థలానికి చేరుకున్నారు. తవ్వకాల్లో బయటపడ్డ మెట్లబావిని పరిశీలిస్తున్నారు. గతవారం బయటపడ్డ ఈ మెట్లబావి 125 నుంచి 150 ఏళ్ల కాలం నాటిదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మొత్తం 400 స్క్వేర్ మీటర్లు ఉందని పేర్కొన్నారు.  

ఈ సందర్భంగా చందౌసి ఎగ్జిక్యూటీవ్ అధికారి కృష్ణ కుమార్ సొంకార్ కీలక వ్యాఖ్యలు చేశారు. '' తవ్వకాలు చేపట్టి నేటికి ఐదు రోజులవుతోంది. మెట్ల బావి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఈ తవ్వకాల ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. మా పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారని'' తెలిపారు. తవ్వకాల ఇంఛార్జి ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మెట్లబావి మొదటి అంతస్తు తవ్వకం జరుగుతోందని తెలిపారు. మొదటి ఫ్లోర్‌ను చూడగలుగుతున్నామని చెప్పారు.    

ఇదిలాఉండగా.. మరోవైపు యోగీ సర్కార్ సంభల్‌ తీర్థయాత్ర స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తోంది. దీనికి సంబంధించిన పనులను కూడా ముమ్మరం చేసింది. సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వే జరిగినప్పుడు హింసాకాండ జరిగిన సంగతి తెలసిందే. ఆ తర్వాత ఇక్కడి జిల్లా యంత్రాగం ఈ ప్రాంతంలో ఒక పురాతన శివాలయాన్ని గుర్తించింది. దీన్ని 1978లో మూసివేసినట్లు పేర్కొంది. అయితే ఇటీవల జరిపిన తవ్వకాల్లో మెట్లబావి కూడా బయటపడటంతో.. యోగీ ప్రభుత్వం శివాలయాన్ని మళ్లీ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. 

Advertisment
తాజా కథనాలు