Pawna Campaign IN MH:
మహారాష్ట్ర బల్లార్‌పూర్ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగులలో మాట్లాడారు. తాను మరాఠీ మాట్లాడ్డం ఇదే మొదటి సారని...ఏమైనా తప్పులుంటే క్షమించాలని అడిగారు. ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని చెప్పారు. శివాజీ మహరాజ్ భూమి అయిన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టారు పవన్. ఇక పవన్ బీజేపీ తరుఫున ప్రచారం చేశారు. అయోధ్య రామమందిరం ప్రతీ అంగుళం ఇక్కడి వారు మహత్వ పూర్ణం చేశారని అన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా రాముడికి తన స్థానం దక్కిందన్నారు. మోదీ, అమిత్ షా, హైవే మేన్ ఆప్ ఇండియా నితిన్ గడ్కరీల ప్రయత్నాల ఫలితం ఇక్కడి రహదారులను చూస్తే తెలుస్తుందని పవన్ చెప్పారు.
ఓట్లు అడగడానికి తాను మహారాష్ట్ర రాలేదని..ఈ నేలకు తన గౌరం తెలపడానికి మాత్రమే వచ్చానని మాట్లాడారు పవన్. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరి సహకారం కోరడానికి వచ్చానన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలలో ఐదో స్ధానంలో ఉన్నాం.. మూడో స్ధానానికి చేరుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే నడిచిన భూమికి వచ్చే అవకాశం తనకు దక్కిందని...అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిజేసుకుంటున్నాని చెప్పారు పవన్ కల్యాణ్. ప్రాంతీయాన్ని విస్మరించని జాతీయవాదం జనసేనదంటూ వ్యాఖ్యానించారు. ఇవాళ బాలా సాహెబ్ ఠాక్రే స్మృతిదినం అని తెలిపారు.స్ధానిక వనరులు, మానవవనరులు కోల్పోకూడదనే తాను తెలంగాణకు కూడా మద్దతిస్తానన్నారు. ప్రాంతీయత బలం ఉండాలి.. జాతీయతా భావాలని చంపకూడదన్నారు.
ఇక భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడానికి NDA కృషి చేస్తోందని పవన్ తెలిపారు . 2028 నాటికి మహారాష్ట్రని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థగా ఎన్డీఏ మార్చనుందని చెప్పారు. ఏపీలో వైసీపీని కొట్టాం అంటే మామూలుగా కొట్టామా.. అలాగే మహారాష్ట్రలో కూడా హ్యాట్రిక్ కొట్టాలి మనం. మోదీ రాకూడదని ఎందరో కోరుకున్నారు.. మూడోసారి తీసుకొచ్చిన సత్తా ఆంధ్ర నుంచీ వచ్చింది. దానిలాగే మహాయుతీ సర్కార్ మహారాష్ట్రలో రావాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.