AP: రాష్ట్ర పరిణామాలు ప్రధానికి వివరించా– సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీతో చర్చలు బాగా జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం సవరించిన వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని సీఎం చెప్పారు. రాష్ట్ర పరిణామాలను వివరించానని తెలిపారు. 

modi
New Update

AP CM Chandra Babu: 

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారన్నారు. దాంతో పాట పోలవరం ప్రాజెక్టు విషయంలో మార్పులు చేసిన వ్యయాల అంచనాలను కేంద్రం ఆమోదం తెలిపిందని చంద్రబాబు తెలిపారు. దానికి ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనే విషయాల్లో కేంద్ర మద్దతు ఉంది. అమరావతికి ప్రధాని ఇస్తున్న మద్దతుని తాను అభినందిస్తున్నా అంటూ ఏపీ సీఎం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

cm

ప్రధాని మోదీతో భేటీ అయ్యాక సీఎం చంద్రబాబు కేద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో రైల్వే శాఖ రూ.73,743 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారని బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏపీలో హౌరా-చెన్నై మధ్య 4 లైన్‌, 73 స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతుంది. మరిన్ని లోకల్  రైళ్లను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. డిసెంబరు నాటికి విశాఖ కొత్త రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని..ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టికల్, కమ్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి భారతీయ రైల్వేతో భాగస్వామ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

 

Also Read: జమ్మూ–కాశ్మీర్‌‌లో మళ్ళీ హంగ్ తప్పదా..మరికాసేట్లో తేలనున్న భవితవ్యం

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe